కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం. ఇటీవలే పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. కొత్త కాపురంలో సంతోషంగా ఉన్నారో లేదో.. విధి ఆడిన వింతనాటకంలో చివరికి ఇద్దరూ ప్రాణాల విడిచారు. అసలేం జరిగిందంటే?
వీళ్లద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు. కోరుకున్న ఉద్యోగం, మంచి జీతం. ఇటీవలే పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన రోజు నుంచి ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించారు. అలా కొత్త కాపురంలో సంతోషంగా ఉన్నారో లేదో.. విధి ఆడిన వింతనాటకంలో చివరికి ఇద్దరు ప్రాణాల విడిచారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
కర్ణాటక హాసన్ జిల్లాలోని అరసికెరె. ఇక్కడే రఘు (35), అనూష (28) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత 2 నెలల కిందటే వివాహం జరిగింది. వీళ్లిద్దరూ బెంగుళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఐటీ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. ఇక కొత్తగా పెళ్లైన దంపతులు సంతోషంగా ఉన్నారు. అయితే ఇటీవల ఈ నూతన దంపతులు బళ్లారిలో ఉన్న తమ బంధువుల ఇంటికి కారులో బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు చిక్కనయకనహళ్లి పరిధిలోని హులియూర్ గేట్ వద్దకు చేరుకుంది. అయితే ఈ సమయంలోనే ఎదురుగా వస్తున్న ఓ లారీ వీరి కారును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో రఘు, అనూష రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. కానీ, కారు డ్రైవర్ మాత్రం తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, గాయపడ్డ డ్రైవర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లై రెండు నెలలు కాలేదు. అంతలోనే విధి ఆడిన వింత నాటకంలో నూతన దంపతులు ప్రాణాలు విడిచారు. ఈ వార్త తెలుసుకున్న వీరి బంధువులు.. పాపం, ఇలాంటి చావు ఎవరికీ రాకూడదని కంటతడి పెడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.