ఈ మధ్యకాలంలో ప్రేమ పేరుతో బయట ఎన్నో దారుణాలు జరుగుతన్నాయి. రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు, ప్రేమించాలని వెంటపడడం, కాదంటే అత్యాచారాలు, ఆపై హత్యలకు కత్తులు నూరుతున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వన్ సైడ్ లవర్ నడి రోడ్డుపై కిరాతకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన ప్రియురాలికి తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చడంతో తట్టుకోలేకపోయాడు. ఏం చేయాలో అర్థం కాక పట్టపగలు అందరూ చూస్తుండగా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
కర్ణాటకలోని దావణెగెరె ప్రాంతం. ఇక్కడే సుల్తానా అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఇదే ప్రాంతంలో సాదత్ అనే యువకుడు కూడా నివాసం ఉంటున్నాడు. అయితే ఎప్పటి నుంచో సాదత్ సుల్తానాపై కన్నేశాడు. ఎలాగైన ఆ అమ్మాయిని ప్రేమించాలనుకున్నాడు. దీని కోసం అనేక సార్లు తన ప్రేమ విషయాన్ని ఆ యువతికి చెప్పాడు. అతని ప్రేమను మాత్రం ఆ యువతి అంగీకరించలేదు. దీంతో సాదత్.. మరోసారి తన ప్రేమను ప్రియురాలికి తెలియజేశాడు. అయినా ఆ యువతి మాత్రం అతనిని ఇష్టపడలేదు. ఇక ఇంతటితో ఆగని సాదత్.. సుల్తానా ఇంటికి వెళ్లి.. మీ కూతురును పెళ్లి చేసుకుంటానని కోరాడు. ఇది విన్న ఆ యువతి తల్లిదండ్రులు షాక్ కు గురై అతడికి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి మా అమ్మాయి జోలికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అయినా వినని సాదత్ అప్పుడప్పుడు ఆ యువతితో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు.
ఈ క్రమంలోనే సుల్తానాకు తల్లిదండ్రులు మరో యువకుడితో వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్నసాదత్ ప్రియురాలిపై కోపంతో రగిలిపోయాడు. నన్ను కాదని వేరో వాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ కోపంతో ఊగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని సాదత్.. ఇటీవల కాపు కాసి పట్టపగలు ఆ యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో సుల్తానా అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. దీంతో వెంటనే స్పందించిన ఆ యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం సుల్తానా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రేమించలేదని ప్రియురాలిని చంపిన ఈ వన్ సైడ్ లవర్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ಪ್ರೀತಿ ನಿರಾಕರಿಸಿದ ಯುವತಿ – ನಡು ರಸ್ತೆಯಲ್ಲೇ ಕೊಂದ ಪಾಗಲ್ ಪ್ರೇಮಿ https://t.co/qCFZISKAU5 #Davanagere #Police #Crime #Love #YoungWomen
— PublicTV (@publictvnews) December 22, 2022