ఓ నేరం కేసులో అతడు నేరస్తుడిగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. గత కొంత కాలం నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి నేను చేసింది తప్పేనని ఎట్టకేలకు తెలుసుకున్నాడు. ఇక జీవితంలో ఇలాంటి నేరం మళ్లీ చేయకూడదని తనకు తాను చెప్పుకున్నాడు. అయితే ఈ కేసులో అతడికి కోర్టు పెద్ద శిక్షవిధిస్తుందని తెలుసుకున్నాడు. దీంతో భయంతో వణికిపోయిన ఆ వ్యక్తి కోర్టు విధించే శిక్ష నుంచి ఎలాగైన తప్పించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇక్కడి నుంచి ఎలాగైన ఎస్కేప్ అవ్వాలని అనేక ప్రయత్నాలు చేశాడు. కానీ విఫలమయ్యాడు. ఇక చేసేదేం లేక ఆ వ్యక్తి చివరికి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇతను తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఖైదీ శిక్ష నుంచి బయటపడేందుకు ఏం చేశాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కర్ణాటకలోని నెత్తినెణెలో ప్రాంతంలో సదానంద అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. జూలై 12న సదానంద శిల్ప అనే మహిళతో చేతులు కలిపి ఆనంద దేవాడిగ అనే వ్యక్తిని నమ్మించి హేబేరు రోడ్డు వద్దకు రమ్మని చెప్పారు. ఇక అతడు వచ్చిన వెంటనే సదానంద, శిల్ప ఇద్దరూ కలిసి ఆనంద దేవాడిగకు నిద్రమాత్రలు ఇచ్చారు. అనంతరం అతడు కారులో ఉండగా ఆ కారుకు నిప్పు పెట్టి అంటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా.. కారుకు నిప్పు పెట్టింది సదానంద, శిల్ప అని తెలుసుకున్నారు. కాగా వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఇక అనంతరం ఇద్దరినీ జైలుకు తరలించారు. గత కొన్నేళ్ల నుంచి సదానంద, శిల్ప ఉడుపి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ కేసులో కోర్టు త్వరలో సదానందకు ఎక్కువ శిక్ష విధిస్తుందని తెలుసుకున్నాడు. ఈ భయంతోనే సదానంద ఈ శిక్ష నుంచి ఎలాగైన తప్పించుకోవాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో అతడికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక చేసేదేం లేక సదానంద జైలు బ్యారెక్ లో తన పంచెతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జైలు అధికారులు షాక్ కు గురయ్యారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.