వివాహేతర సంబంధానికి అలవాటు పడ్డ కొందరు దంపతులు నిండు కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు. సొంత కాపురాన్ని పక్కకు నెట్టి పరాయి సుఖం అక్రమ సంబంధానికి జై కొడుతున్నారు. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ భర్త భార్యను కాదని వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య సహించలేక కొడుకుతో పాటు తాను ఆత్మహత్య చేసుకుంది. సోమవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని నాగమంగల కుంభార వీధిలో నవీన్, బిందు అనే దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ జంట నాలుగేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదురించి మరీ వివాహం చేసుకున్నారు. కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. పుట్టిన కొడుకుతో సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భర్త పరాయి సుఖం కోసం పక్క చూపులు చూశాడు. ఈ విషయం కొన్నాళ్లకు భార్య బిందుకి తెలియడంతో సహించలేకపోయింది. దీంతో పాటు ఈ క్రమంలోనే అత్తమామలు, ఆడపడుచు సైతం ఆమెను వేధించడం మొదలు పెట్టారు.
భర్త వివాహేతర సంబంధం, అత్తింటి వేధింపులతో బిందు తట్టుకోలేకపోయింది. ఇలాంటి ఒత్తిళ్లకు గురైన ఆ మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక బతికి ఉండి నరకం చూడడం కన్నా చనిపోవడం బెటర్ అనే ఆలోచనలు చేసింది. ఇందులో భాగంగానే బిందు సోమవారం తన కొడుకు ఉరి వేసి.., అదే తాడుతో తాను ఆత్మహత్య చేసుకుంది. బలవన్మరణానికి ముందు బిందు సూసైడ్ నోట్ రాస్తూ.. చావుకి నా భర్త, అత్తమామలు, ఆడపడుచే కారణమని తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బిందు తల్లిదండ్రులు విగత జీవిగా పడి ఉన్న కూతురిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం బిందు తండ్రి కూతురి ఆత్మహత్యపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.