ఈ ముగ్గురు ఓ కాలేజీలో డీ ఫార్మసీ చదువుతున్నారు. అయితే ఇటీవల సరదాగా బైక్ పై బయటకు వెళ్లారు. విహార యాత్రకు వెళ్లిన అందరూ ఓ నిర్ణయం తీసుకున్నారు. కానీ.. ఆ నిర్ణయమే చివరికి ముగ్గురి ప్రాణాలను తీసింది. అసలేం జరిగిందంటే?
బెంగుళూరులోని కర్ణాటక కాలేజీలో పూజ, ఇమ్రాన్, రాధిక, చన్నారం, సునీతతో పాటు బికాష్‌లు అనే విద్యార్థులు డీ ఫార్మసీ కోర్సు చదువుతున్నారు. అయితే వీళ్లిందరూ స్నేహితులు కావడంతో కాలేజ్ బంక్ కొట్టి సరదాగా ఓ రోజు బయటకు వెళ్లాలని అనుకున్నారు. ఇక అనుకున్నట్లుగానే ఆ ఆరుగురు బక్ లపై శ్రీనివాస సాగర్ డ్యాం చూడటానికి చిక్కబళ్లాపూర్ వెళ్లారు. మధ్యాహ్నం సమయానికల్లా అక్కడికి చేరుకున్నారు. ఇక ఎండతీవ్రత అధికంగా ఉండడంతో ఆ నీటిని చూసి ఆ యువకుడు ఈత కొడదామని అన్నాడు. దీనికి అందరూ కూడా సరే అన్నారు.
అయితే ముందుగా పూజ, ఇమ్రాన్, రాధిక నీటిలోకి దిగారు. వీరిని చూసిన మిగతా ముగ్గురు విద్యార్థులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ నీటిలో దిగారు. కొద్దిసేపు అందరూ నీటిలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సంతోషంగా మురిసిపోయారు. అయితే అలాగే కొద్దిగా ముందుగా వెళ్లగానే కాస్త లోతుగా ఉండడంతో పూజ, ఇమ్రాన్, రాధిక నీటి లోపలికి వెళ్లిపోయారు. ఎంతకు వారు పైకి రాకపోవడంతో మిగతా ముగ్గురు స్నేహితులు వారిని కాపాడే ప్రయత్నం చేయబోయారు. ఆ సమయంలో ఈ విద్యార్థులకు ఏం చేయాలో తెలియక భయంతో బయటకు వచ్చారు. అనంతరం వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత పూజ యువతి మృతదేహం లభ్యమైంది. పూజ, ఇమ్రాన్, రాధిక చనిపోయారని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక పోలీసులు మిగతా ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.