పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరూ ప్రేమికులు. వీళ్లు గత కొంత కాలం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ ప్రేమికులు ఎవరూ ఊహించని పాడు పనికి తెర లేపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీరి దారుణం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
వాళ్లిద్దరూ ప్రేమికులు. గత కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేసేవారు. అలా వీరి ప్రేమాయణం కొన్ని రోజులు గడిచింది. ఇదిలా ఉంటే.. ఈ ప్రేమికులు ఎవరూ ఊహించని పాడు పనికి శ్రీకారం చుట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా పక్కాగా ప్లాన్ ను అమలు చేస్తూ ఎంచక్కా ముందుకు కదిలారు. అయితే అసలు విషయం బయట పడడంతో పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వీరి చేసిన ఘన కార్యం ఏంటో తెలుసుకుని.. ఛీ.. ఇలాంటి ప్రేమికులు కూడా ఉంటారా అంటూ వాపోతున్నారు. అసలు ఈ ప్రేమికులు ఎవరు? వీళ్లు చేసిన ఆ ఘనకార్యం ఏంటి?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని మల్లేశ్వరం ప్రాంతం. ఇక్కడే మరుగన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. వృత్తి రిత్యా ఇతడు నేరస్తుడు కావడంతో స్థానిక ప్రాంతాల్లో ఎన్నో దొంగతనాలు చేశాడు. ఇకపోతే.. రెండేళ్ల కిందట ఓ బైక్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి ఈ మధ్యే బయటకు వచ్చాడు. ఇక బయటకు రాగానే ఇతగాడికి యాస్మిన్ అనే అనాథ అమ్మాయితో పరిచయంఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ సినిమాలు, షికారులు తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఈ ప్రేమికులు విలాసవంతమైన జీవితాన్ని గడపాలని అనుకున్నారు. కానీ, చేతిలో చిల్లి గవ్వలేదు.
ఆ సమయంలో వారికి ఏం చేయాలో తోచలేదు. ఎలాగో ప్రియుడు మురగన్ దొంగతనంలో ఆరి తేరడంతో ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే స్థానిక పోలీసుల కళ్లు గప్పి మల్లేశ్వరం, శ్రీరాంపూర్, కొడిగేహళ్లి ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న బైక్ లను దొంగిలించేవారు. అలా కొన్ని రోజులు జీవితాన్ని గడిపారు. ఇకపోతే.. ఈ ప్రేమ జంట ఇటీవల మల్లేశ్వర్ పరిధిలోని 15వ అవెన్యూలో కౌశిక్ అనే విద్యార్థి వద్ద సెల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. స్థానికులు అంతా గమనించి వారిద్దరినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వీరి వద్ద ఉన్న 2 రెండు సెల్ ఫోన్లు, 3 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. బరితెగించి దొంగతనాలకు పాల్పడిన ఈ ప్రేమ జంట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.