నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ఆశపడింది. పెళ్లైన కొన్ని రోజుల పాటు ఆమె భర్త భార్యతో బాగానే ఉన్నాడు. ఇక అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని దారుణం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పెళ్లి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. నచ్చిన వారిని మనువాడి పిల్లా పాపలతో సంతోషంగా గడపాలని ప్రతీ ఒక్క యువతి కోరుకుంటుంది. ఈ క్రమంలోనే కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే, మరి కొందరు మాత్రం తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాలు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టింది ఓ యువతి. ఇంట్లోకి కోడలు వచ్చిందని అత్తమామలు సైతం సంభరపడ్డాడు. ఇక భర్త కూడా భార్యను బాగానే చూశాడు. అలా నెలన్నర గడిచింది. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక ధర్వాడ జిల్లా అనేరికి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన షహబాద్ ములగంజ (26)కు గదగ్ జిల్లా గజేంద్రడకు చెందిన షహనాజ్ బేగం (24)తో గత నెలన్నర కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో వధువు తల్లిదండ్రులు వరుడికి కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. అలా పెళ్లైన కొన్ని రోజుల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. అయితే రాను రాను ములగంజ అసలు రూపం బయటపడింది. పెళ్లిలో పెట్టింది చాలదన్నట్లు అదనపు కట్నం తేవాలంటూ భర్త వేధించడం మొదలు పెట్టారు. దీనికి అత్తమామలు కూడా కొడుకుకి వత్తాసు పలికారు. ఇక వీరి టార్చర్ రోజు రోజుకు మరింత ఎక్కువైపోయింది. ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆ యువతికి కన్నీళ్లు, వేధింపులు స్వాగతం పలికాయి.
భర్త, అత్తమామల వేధింపులను ఆ యువతి తట్టుకోలేకపోయింది. అయితే ఇటీవల రంజాన్ పండుగ కావడంతో అందరూ అదే హడావిడిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి.. షహనాజ్ బేగం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని భర్త ములగంజ భార్య షహనాజ్ బేగం తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిండ్రులు, కుటుంబ సభ్యులు హుటాహుటన షహనాజ్ బేగం వద్దకు చేరుకున్నారు. చనిపోయిన కూతురుని చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం పేరుతో మా కూతురిని హింసించి హత్య చేశారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.