ఆమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా సరే పరాయి మగాడితో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. అంతేకాకుండా ఆ మహిళ తన ప్రియుడి వద్ద ఏకంగా రూ.3 లక్షలు తీసుకుని..!
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శ్యామ్‌ప్రసాద్. స్థానికంగా ఉండే ఓ పెళ్లైన మహిళపై మోజు పడ్డాడు. ఆమె కూడా ఇతనితో మాటలు కలిపింది. అలా వీరి పరిచయం రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. ఇక ఇంకేముంది.. ఇద్దరికీ టైమ్ దొరికినప్పుడల్లా సరసాలు తెరలేపుతూ బాగానే ఎంజాయ్ చేశారు. అలా కొన్నేళ్ల పాటు వీరి చీకటి కాపురం బాగానే సాగుతూ వచ్చింది. కట్ చేస్తూ వీరి ప్రేమాయణం ఉన్నట్టుండి ఊహించని మలుపుకు తిరిగింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజనగూడ ప్రాంతం. ఇక్కడే శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి నివాసం ఉండేవాడు. ఇదిలా ఉంటే ఇదే గ్రామంలో మహదేవచారి-మంజుల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇకపోతే శ్యామ్ ప్రసాద్ ఎప్పటి నుంచో మంజులను గమనిస్తూ వచ్చాడు. రాను రాను ఆమెపై మోజుపడి చివరికి ఆ మహిళతో మాటలు కలిపాడు. మంజుల కూడా శ్యామ్ ప్రసాద్ తో మాట్లాడుతూ అతనితో దగ్గరైంది. అలా వీరి పరిచయం రాను రాను వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. దీంతో వాళ్లిద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఎంజాయ్ చేస్తూ వచ్చారు.
మరో విషయం ఏంటంటే? గతంలో మంజుల ప్రియుడు శ్యామ్ ప్రసాద్ వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకుంది. అలా కొన్ని రోజులు గడిచింది. తీసుకున్న అప్పు ఇవ్వాలని ప్రియురాలు మంజులను శ్యామ్ ప్రసాద్ అనేకసార్లు కోరాడు. దీనికి మంజుల ఇస్తానంటూ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది. ఇక విసిగిపోయిన శ్యామ్ ప్రసాద్.. ఈ నెల 8న తీసుకున్న రూ.3 లక్షలు ఇవ్వాలని మంజులను గట్టిగా ప్రశ్నించాడు. దీనికి ప్రియురాలు ఇవ్వనంటూ తేల్చి చెప్పింది. దీంతో శ్యామ్ ప్రసాద్ ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి మంజులను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంజుల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.