పైన ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు పురుశోత్తం, విద్యా. వీరికి గత కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కట్ చేస్తే ఈ భార్యాభర్తలు ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
పురుశోత్తం, విద్యా ఇద్దరూ దంపతులు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ భార్యాభర్తల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను ఆ దంపతులు పెంచి పెద్ద చేశారు. ఇప్పుడిప్పుడే స్కూల్ కు కూడా వెళ్తున్నారు. అంతా బాగానే ఉందనుకున్న తరుణంలోనే ఈ దంపతులు ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
కర్నాటక రాష్ట్రం మండ్య జిల్లా శ్రీరంగ పట్టణ పరిధిలోని కె.శెట్టిహళ్లి గ్రామం. ఇక్కడే పురుశోత్తం (45), విద్యా (32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అలా కొంత కాలం తర్వాత వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే పురుశోత్తం మైసూరులోని ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.., భార్య ఇంటి వద్దే ఉండేది. దీంతో వీరి జీవితం ఎంతో సంతోషంగా సాగుతూ ఉండేది. ఇకపోతే గత కొంత కాలం నుంచి ఈ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల భార్య ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది.
ఇక సాయంత్రం భర్త ఇంటికి వచ్చి చూడగా..భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ చూసిన పురుశోత్తంకు ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. చేసేదేం లేక భర్త.. నేరుగా పొలంలోకి వెళ్లి ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇరువురి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మొత్తానికి దంపతులు చనిపోవడంతో పిల్లలు చివరికి తల్లిదండ్రులు లేని అనాథలుగా మారిపోయారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్న ఈ దంపతుల ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.