ఓ కోడలు మామను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకంగా మారింది. కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలోని భైరవనదొడ్డి గ్రామం. గంటప్ప అనే వ్యక్తి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన కుమారుడికి చైత్ర అనే అమ్మాయితో గతంలో వివాహం జరిపించారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కోడలు చైత్ర ఆస్తిలో భాగం తీసుకోవాలనే కోరిక తన మదిలో మెదులుతూ ఉంది. అందులో భాగంగానే చైత్ర ఓ రోజు మామను అడిగింది. కానీ దీనికి మామ నిరాకరించాడు.
ఇది కూాడా చదవండి: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన భార్య! ఊహించని శిక్ష వేసిన భర్త!
దీంతో అప్పటి నుంచి చైత్ర మామపై పగ పెంచుకుంది. ఎలాగైన మామను హత్య చేయిలని అనుకుంటూ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే చైత్రకు స్థానికంగా ఉండే నవీన్ ను పెళ్లికన్న ముందు నుంచే ప్రేమిస్తూ ఉంది. పెళ్లైన తర్వాత కూడా వారి ప్రేమాయణం అలాగే కొనసాగుతూ వస్తుంది. కాగా ప్రియుడు నవీన్ సాయంతో మామను హత్య చేయాలని భావించి పథకం వేసింది. ఇక అనుకున్నట్లుగానే ఓ రోజు చైత్ర ప్రియుడితో కలిసి మామ గంటప్పను దారుణంగా హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో చైత్రతో పాటు ప్రియడు నవీన్ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.