ఆమె పేరు జయమ్మ. ఆర్థింకగా బలంగా ఉండడంతో గ్రామంలోని కొంతమందికి అప్పలు ఇచ్చేది. అయితే ఉన్నట్టుండి ఆ మహిళ అడవిలో శవమై కనిపించింది. ఆమెను చంపింది ఎవరో తెలుసుకుని పోలీసులు షాక్ గురయ్యారు.
గత కొన్ని రోజుల కిందట 50 ఏళ్ల వృద్ధురాలిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఆ తర్వాత అడవిలో కాల్చేసిన విషయం తెలిసిందే. ముందుగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించారు. అయినా దొరకగా పోగా.. తాజాగా ఆమెను హత్య చేసి కాల్చేశారని తెలిసింది. ఆమెను ఎవరు హత్య చేశారు? అసలేందుకు అలా చేశారనే వివరాలు తెలుసుకునే క్రమంలోనే పోలీసులకు నమ్మలేని నిజాలు తెలిశాయి. ఎవరో చంపారో తెలిసి ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటక చిత్రదుర్గ జిల్లా నాయికనహట్టి పరిధిలోని కొండ్లహళ్లి గ్రామం. ఇదే ఊరిలో జయమ్మ (50) అనే వృద్ధురాలు నివాసం ఉండేది. ఆర్థికంగా ఆమె బలంగానే ఉండడంతో ఆమె వద్ద గ్రామంలోని చాలా మంది అప్పులు తీసుకునేవారు. ఇక గతంలో ఇదే గ్రామానికి చెందిన రాధమ్మ అనే మహిళ తన అవసరం నిమిత్తం జయమ్మ వద్ద కొంత డబ్బును అప్పుగా తీసుకుంది. చాలా రోజులు గడిచింది. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలంటూ జయమ్మ రాధమ్మను అనేకసార్లు అడిగింది. ఇస్తానంటూ ఆ మహిళ రోజులు దాటవేస్తూ వచ్చింది. కట్ చేస్తే.. గత కొన్ని రోజుల నుంచి జయమ్మ కనిపించకుండా పోయింది.
దీంతో ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల తర్వాత స్థానికంగా ఉన్న అడవిలో ఓ మహిళను హత్య చేసి కాల్చేశారు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. కాల్చివేయడంతో ఆ మహిళ ఎవరనేది తేల్చడానికి పోలీసులకు కాస్త టైమ్ పట్టింది. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి కనిపించకుండాపోయిన మహిళల వివరాలు తెలుసుకున్నారు. దీంతో జయమ్మ కుటుంభ సభ్యులను పిలిపించి ఆ మహిళ మృతదేహాన్ని చూపించగా.. ఆమె ఎవరో కాదు.., జయమ్మే అంటూ తేల్చి షాక్ గురయ్యారు.
అనంతరం పోలీసులు ఆ వృద్ధురాలిని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అసలు జయమ్మను చంపింది ఎవరు? ఎందుకు చంపారనే పూర్తి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. ఇక పోలీసుల దర్యాప్తులో భాగంగా ఆమె చేసే వ్యాపారం గురించి కూడా తెలుసుకున్నారు. ఆమె ఎవరెవరికి అప్పులు ఇచ్చిందని పూర్తి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే అప్పు తీసుకున్న రాధమ్మను పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. జయమ్మ వద్ద డబ్బు, నగలు దొంగిలించేందుకు కుమరుడితో పాటు మరో వ్యక్తి సాయం తీసుకుని హత్య చేసినట్లుగా తన నేరాన్ని అంగీకరించింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్ట్ చేశారు. జయమ్మను చంపింది ఎవరో తెలుసుకుని ఆమె కుటుంబ సభ్యులు, పోలీసులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.