వివాహేతర సంబంధాలు.. ఇవే సంతోషంగా సాగుతున్న కాపురంలో నిప్పులు రాజేస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భార్య ఇలా ఎవరికి వారు అక్రమ సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ వివాహిత భర్తను కాదని ప్రియడితో జతకట్టి ఏకంగా కట్టుకున్న భర్తనే హతమర్చిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటకలోని తమకూర్ ప్రాంతం. రాజు, మీనా ఇద్దరు భార్యా భర్తలు. వీరికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వీరికి వివాహం అయి దాదాపుగా ఏనిమిదేళ్లు కావస్తోంది. ఈ క్రమంలోనే భార్య మీనా భర్తను కాదని పరాయి వాడిపై మనసుపడింది. అతడి పేరే రాకేష్. ఇతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మీనా టైలర్ కావడంతో రాకేష్ అటువైపు వస్తుండేవాడు. దీంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. రోజులు గడిచేకొద్ది వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ఇది కూడా చదవండి: డాక్టర్ కాదు కామ పిశాచి.. 48 మంది మహిళలపై లైంగిక దాడి!
దీంతో సమయం దొరికినప్పుడల్లా ఇద్దరూ శారీరకంగా కలుసుకునేవారు. ఇక కొన్నాళ్లకి భార్య మీనా ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఓసారి గట్టిగానే మందలించాడు. ఇలా అయితే కాదని భావించిన మీనా, రాకేష్ రాజును ప్రాణాలతో లేకుండా చేయాలనే ఆలోచనకు వచ్చారు. ఇక ప్లాన్ లో భాగంగానే రాజుకు రాకేష్ పరిచయం ఉండడంతో ఓ రోజు కలిసి ఇద్దరు మందు పార్టీకి వెళ్లారు. ఇదే సమయంలో దొంగచాటున భార్య మీనా కూడా ఉండడంతో ఇద్దరూ కలిసి అతిగా మద్యం సేవించిన తర్వాత రాజు తలపై బండరాయితో బలంగా బాదారు. దీంతో రక్తపు మడుగులో పడి భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో డెడ్ బాడీని అక్కడే పెట్రోల్ పోసి నిప్పంటించారు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని పై దర్యాప్తు జరిపారు. పోలీసుల విచారణలో భాగంగా భార్యపై అనుమానం రావడంతో విచారించగా అసలు నిజం బయటకు వచ్చింది. దీంతో రాకేష్, మీనాలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.