ఆ మహిళకు భర్త అంటే ప్రాణం. ఆమె భర్త మాత్రం ప్రియురాలితో ఎంజాయ్ చేసేవాడు. అసలు విషయం భార్యకు తెలియడంతో కోపంతో ఊగిపోయి భర్తకు వార్నింగ్ ఇచ్చింది. కట్ చేస్తే.. ఆ మహిళ చివరికి భర్త చేతిలో హత్యకు గురైంది.
ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా అక్రమ సంబంధాల కోసం పాకులాడుతున్నారు. కట్టుకున్న వాళ్లను లెక్కచేయకుండా పరాయి వాళ్లపై మోజుపడి చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందని కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని ఓ ప్రాంతంలో యూరి స్వామి-రోజా (27) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త ఫొటోగ్రాఫర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య రోజా ఇంటి వద్దే ఇంటూ తన పిల్లలను చూసుకునేది. అలా వీరి జీవితం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతూ వచ్చింది. అయితే భర్త యూరి స్వామి వృత్తి రిత్యా ఫొటో గ్రాఫర్ కావడంతో అతనికి చాలా మంది మహిళలతో సంబంధాలు ఉండేవి. భర్త యూరి స్వామి స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేర సంబంధాన్ని కొనసాగించాడు. ఇదే విషయం కొన్నాళ్ల తర్వాత అతని భార్య రోజాకు తెలిసింది.
దీంతో ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి. భర్త బరితెగించి ఏకంగా భార్య ముందే అనేక సార్లు ప్రియురాలతో తిరిగినట్లు సమాచారం. భార్య రోజా ఇక నుంచైనా పద్దతి మార్చుకుని బుద్దిగా ఉండాలంటూ భర్తను కోరేది. అయినా ప్రవర్తన మార్చుకుని యూరి స్వామి.. తన ప్రియురాలితో తిరిగేవాడు. విసిగిపోయిన భార్య రోజా.. ఇటీవల భర్తను గట్టిగా నిలదీసింది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భర్త యూరి స్వామి.. భార్యను దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్తే మా అమ్మాయిని చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.