కర్నాటకలోని బెళగావి కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త నవ్య శ్రీ రావు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. హార్టికల్చర్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ రాజకుమార టాకళె నా భర్తే అని, గతంలో మాకు పెళ్లి కూడా జరిగిందని అంటోంది నవ్య శ్రీ. కానీ ఇప్పుడు మాత్రం ఆయన తానెవరో తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, దానికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయని నవ్యశ్రీ తెలిపింది.
అయితే ఆమె వాదన ఇలా ఉంటే.. రాజకుమార టాకళె వాదన మాత్రం మరోలా ఉంది. నవ్యశ్రీ కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను కలిస్తే రూ.2 లక్షలు ఇచ్చి సాయం చేశానని, అప్పటి నుంచి నాకు రూ.50 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తోందని రాజకుమార వాపోతున్నారు. నాకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని, నవ్యశ్రీ నుంచి నన్ను రక్షించాలని రాజకుమార పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చదవండి: మెట్రోలో డ్యాన్స్ చేసిన యువతికి ఝలకిచ్చిన అధికారులు!
మరో విషయం ఏంటంటే? నవ్య శ్రీ, రాజకుమార గతంలో సన్నిహితంగా కలిసి ఉన్నట్లు ఫోటోలు, వీడియోలు కూడా బయటపడుతుండడం విశేషం. ఇక ఎవరి వాదన ఎలా ఉన్నా ఫోటోలు, వీడియోలు చూస్తుంటే గతంలో వీరిద్దరు సన్నిహితంగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రోజుకొక మలుపు తిరుగుతున్న వీరిద్దరి వ్యవహారం రాబోయే రోజుల్లో ఎక్కడికి చేరుకుంటుందో చూడాలి మరి. వీరిద్దరి వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.