బట్టల అంగడి నిర్వహిస్తున్న సమ జీవితంలోకి పోలీస్ మయనూరప్ప వచ్చాడు. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా సహజీవనం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మూడు సార్లు అబార్షన్..
ప్రేమ పేరుతో మోసాలు చేయటం కొంతమందికి మామూలైపోయింది. ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి ప్రజలకు సేవ చేయాల్సిన రక్షక భటుల్లో కూడా మోసాలకు పాల్పడేవారు దర్శన మిస్తున్నారు. యువతిని పెళ్లి చేసుకుంటానని ఓ పోలీస్ మోసానికి పాల్పడ్డాడు. ఆమెతో 5 ఏళ్లు సహజీవనం చేసి, చివరకు హ్యాండ్ ఇచ్చాడు. ఈ సంఘటన కర్ణాటకలోని కుప్పర జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పర జిల్లా మునిరాబాద్‌కు చెందిన సుమ బట్టల అంగడి నిర్వహిస్తోంది. ఈమెకు అదే ప్రాంతంలో ఐఆర్‌బీ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న మయనూరప్పతో పరిచయం ఏర్పడింది.
పరిచయం కాస్తా ప్రేమగా మారింది. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న ఆమె జీవితంలోకి మయనూరప్ప మోసపు మాటలతో వెలుగులు నింపాడు. ఆమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పాడు. దీంతో శారీరకంగా కూడా దగ్గర అయ్యింది. ఇద్దరూ గత ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె 3 సార్లు గర్భం దాల్చింది. ‘ పెళ్లి కాకుండా తల్లి అయితే సమాజం తప్పుబడుతుంది’ అని చెప్పి మూడు సార్లు అబార్షన్ చేయించాడు. గత కొన్ని రోజుల నుంచి సుమకు దూరంగా ఉంటున్నాడు. మయనూరప్ప తనను మోసం చేశాడని గ్రహించిన సుమ ఎస్పీ దగ్గరకు వెళ్లింది.
అతడిపై ఫిర్యాదు చేసింది. మయనూరప్పపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చాడు. కాగా, సుమకు రెండు సార్లు పెళ్లయింది. మొదటి భర్త చనిపోగా.. రెండవ భర్త విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా ఉంటున్న ఆమె జీవితంలోకి మయనూరప్ప వచ్చాడు. ఆమెను దారుణంగా మోసం చేశాడు. మరి, ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన పోలీస్ ఉదంతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.