వస్తువుల కోసం నిండు ప్రాణాలు బలి చేసుకుంటున్న వారు.. తీసుకుంటున్న వారు మన సమాజంలో ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ కోసం ఓ యువకుడు ఎంతటి దారుణానికి ఒడిగట్టాడు అంటే..
మానవత్వం పూర్తిగా కనుమరుగవుతున్న రోజులు ఇవి. కళ్ల ముందే దారుణం జరుగుతున్నా.. సాయం చేయాలన్న కనీస స్పృహ కోల్పోయి.. కుదిరితే వీడియోలు, సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తాం. కానీ సాయం మాత్రం చేయం. ఇక నేటి కాలంలో చిన్న చిన్న విషయాలకు గొడవపడి.. దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా వెలుగు చూస్తున్న నేరాలు చూస్తే.. ఈ విషయం అర్థం అవుతుంది. తాజాగా ఓ 20 ఏళ్ల యువకుడు ఐఫోన్ కోసం డెలివరీ బాయ్‌ను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు డెలివరీ బాయ్ శవాన్ని ఇంట్లోనే పెట్టుకుని గడిపాడు. ఈ దారుణ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలో ఈ దారుణం వెలుగు చూసింది. హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్తా(20) అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో 46 వేల రూపాయలకు సెకండ్ హ్యాండ్ ఐఫోన్ ఆర్డర్ చేశాడు. ఫిబ్రవరి 7 ఇ-కార్డ్ ఎక్స్‌ప్రెస్ డెలివరీ బాయ్.. హేమంత్ ఆర్డర్ చేసిన ఐఫోన్‌ను అతడికి ఇవ్వడానికి హేమంత్ ఇంటికి వచ్చాడు. అయితే డబ్బులు ఇవ్వకుండానే.. ఫోన్ బాక్స్ ఒపెన్ చేసి చూపించాలంటూ హేమంత్.. డెలివరీ బాయ్‌ను కోరాడు. అయితే పేమెంట్ అయ్యాకే డెలివరీ ఇస్తానని.. ఇ-కార్ట్ బాయ్ స్పష్టం చశాడు.
దాంతో హేమంత్ తన వద్ద డబ్బులు లేవని.. కాసేపు వెయిట్ చేస్తే.. మనీ తెచ్చి ఇస్తానని చెప్పాడు. ఆ మాటలు నమ్మి డెలివరీ బాయ్ హేమంత్ ఇంట్లోకి వచ్చాడు. ఇదే అదునుగా భావించిన హేమంత్ కత్తితో డెలివరీ బాయ్‌ని పలుమార్లు పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత భయపడిన హేమంత్.. డెలివరీ బాయ్ హత్యను దాచేందుకు ప్రయత్నించాడు. నాలుగు రోజుల పాటు డెలివరీ ఏజెంట్ శవాన్ని తన ఇంట్లోనే బాత్రూంలో దాచాడు హేమంత్.
ఈలోపు మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో.. దాన్ని గోనెసంచిలో దాచి.. బైక్‌పై సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లాడు హేమంత్. డెడ్‌బాడీని అక్కడ పడేసి.. పెట్రోల్ పోసి మృతదేహానికి నిప్పంటించాడు. అయితే నాలుగు రోజులుగా డెలివరీ బాయ్ కనిపించకపోవడంతో.. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ఈదారుణం వెలుగులోకి వచ్చింది. ఇక డెలివరీ బాయ్ కాల్ డాటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడు హేమంత్ దత్తాను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇక హేమంత్.. డెలివరీ బాయ్ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.