Crime News : కర్ణాటక రాష్ట్రంలోని గదగ్‌లో భార్యను అత్యంత కిరాతకంగా 23 సార్లు నరికిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు కోలుకుంది. తనను మోసం చేసి పెళ్లి చేసుకున్న భర్త నుంచి ప్రాణం పాయం పొంచి ఉందని పోలీసులకు విన్నవించింది. భర్త తనను హింసించిన తీరును వారికి వివరించింది. ఆమె ఏమన్నదంటే.. ‘‘ హిజాజ్ అనే వ్యక్తి ఆటోలో నేను ప్రతి రోజు కాలేజీకి వెళ్లేదాన్ని. ఈ నేపథ్యంలో ఓ రోజు నన్ను లైంగికంగా వేధించి వీడియోలు తీశాడు. నా తల్లిదండ్రులకు చూపెడతానని బెదిరించి 2018లో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత నన్ను విజయపుర తీసుకెళ్లాడు. నన్ను మానసికంగా శారీరకంగా హింసించాడు. తన మతంలోకి చేరితేనే నాతో కాపురం చేస్తానన్నాడు.
మతం మార్చుకునేలా చేశాడు. మాంసం వండాలని, నేను కూడా మాంసం తినాలని ఒత్తిడి తెచ్చేవాడు. నన్ను ఏదో ట్రాన్స్‌లోకి తీసుకెళ్లాడు. నేను అతడు చెప్పినట్లు వినేదాన్ని. ఆ తర్వాత అతడికి ఇదివరకే పెళ్లయిందని నాకు తెలిసింది. దీంతో పుట్టింటికి వెళ్లిపోయా.. విడాకులకు అప్లై చేశా. మరికొద్ది రోజుల్లో కోర్టులో విచారణ ఉందని అనగా.. ఈ నెల 12న గదగ్‌కు వచ్చి నాతో మాట్లాడాలని పిలుచుకెళ్లాడు. మచ్చు కత్తితో 23 సార్లు నరికాడు. అతడి వల్ల నాకు, నా బిడ్డ ప్రాణాలకు ముప్పు ఉంది’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : స్నేహితుడి ఇంట్లో భార్య! ఓ రోజు రాత్రి బెడ్ రూమ్ లో!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.