రోజురోజుకీ అభివృద్ధి చెందుతోన్న సాంకేతికత ద్వారా మనకు కలిగే ప్రయోజనాలే కాదు.. పరిణమించే ముప్పు శాతం కూడా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ ద్వారా మన ప్రమేయం లేకుండానే మనకు సంబంధించిన సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లిపోతోంది. ఈ తరహా టెక్నాలజీలో స్పై కెమెరాలు కూడా ఒక భాగమే అవుతున్నాయి. వీటిని ఉపయోగించి నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య కోకొల్లలుగా ఉంటోంది. తాజాగా, కర్ణాటకలోని ఒక కాలేజీ హాస్టల్‌లోని అమ్మాయిల బాత్‌రూమ్‌లో స్పై కెమెరాలు ఉపయోగించి వీడియోలు రికార్డు చేస్తున్న ఒక విద్యార్థి పట్టుబట్టాడు. అతని మొబైల్ లో 1200కు పైగా నగ్న వీడియోలు ఉన్నాయట.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక, హోసకెరెహళ్లి సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో శుభమ్ ఆజాద్ అనే విద్యార్థి బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు. లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌లో ఒక స్పై కెమెరాను అమర్చాడు. ఆ కెమెరాను తన మొబైల్ అనుసంధానించి దాని ద్వారా అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు చేస్తున్నాడు. అయితే.. ఇటీవల ఒకరోజు కెమెరాను సరిచేయడం కోసం అతడు లేడీస్ బాత్‌రూమ్‌లోకి వెళ్లాడు. అయితే మూసి ఉన్న ఆ బాత్‌రూమ్ వెంటిలేటర్ నుంచి అతడు బయటకు తొంగి చూడటాన్ని విద్యార్థినులు గమనించారు.
ఈ విషయాన్ని విద్యార్థినులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా.. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడు శుభమ్ ఆజాద్‌ను గుర్తించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతడిని అరెస్ట్ చేసి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఆ విద్యార్థి మొబైల్ ఫోన్‌లో 1200కుపైగా అమ్మాయిల నగ్న, అర్ధ నగ్న వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందులో అతడ్ని గాళ్‌ఫ్రెండ్స్‌వి కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే అతడి వద్ద మరో మొబైల్ ఫోన్ కూడా ఉందని, అందులో మరిన్ని నగ్న వీడియోలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నదా అన్న దానిపై ఆ విద్యార్థిని ప్రశ్నిస్తున్నారు.