స్వామిజీలు, సన్యాసులు అంటే.. భౌతిక సుఖాలను మీద ఎలాంటి ఆశ లేకుండా.. భగవంతుడి సేవలో తరిస్తారు. దేని మీద ఆశ లేకుండా.. కోరికలను జయించి.. ప్రపంచాన్ని తమ కుటుంబంలా భావించి.. అందరిని సమానంగా ప్రేమిస్తారు. అందుకే మన సమాజంలో స్వామిజీలకు ఎంతో గౌరవ మర్యాదలు లభిస్తాయి. రామకృష్ణ పరమ హంస, స్వామి వివేకానంద వంటి వారికి మన సమాజంలో ఎంతటి గౌరవప్రద స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు కోరికలను జయించి.. మనసావాఛా సమాజ సేవకే అంకితం అయ్యి.. యోగులుగా కీర్తింపబడ్డారు. కానీ నేటి కాలంలో కొందరు స్వామిజీల తీరుతో మఠాలు అంటేనే ఆసాంఘీక కార్యకలపాలకు అడ్డా అన్నట్లుగా మారాయి. నిత్యానంద, డేరా బాబా వంటి వారు స్వామిజీల పేరు చెప్పుకుని.. ఎలాంటి సిగ్గుమాలిన పనులకు పాల్పడ్డారో చూశాం. తాజాగా మరో మఠాధిపతి అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.
ఇక సదరు మఠాధిపతికి.. కేంద్ర, రాష్ట్రంలో పలువురు కీలక రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఎందరో సెలబ్రిటీలు.. ఆయన దర్శనం కోసం వస్తారు. ఇక సదరు మఠం అధ్వర్యంలో వందల సంఖ్యలో పాఠశాలలను ఏర్పాటు చేసి.. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిస్తుండటంతో ఆ మఠం మీద జనాలకు సదాభిప్రాయం ఉంది. బయటకు సమాజ సేవ చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తూ.. మఠం లోపల.. విద్యార్థినిలకు మత్తు మందు ఇచ్చి.. అత్యాచారాలకు పాల్పడుతున్నాడు మఠాధిపతి. దీని గురించి ఇద్దరు బాలికలు ఫిర్యాదు చేయడంతో.. మఠంలో జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు..
కర్ణాటక, చిత్రదుర్గలోని మురుఘ మఠం.. ఎంతో ప్రాఖ్యాతి చెందింది. మఠం అధ్వర్యంలో సుమారు 150కి పైగా పాఠశాలలు నడిపిస్తూ.. పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం మఠాధిపతిగా ఉన్న శివమూర్తి మురుఘ కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాడు. సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన చిన్నారులపై అకృత్యాలకు పాల్పడ్డాడు. ఎన్నో రోజులుగా ఈ దారుణం కొనసాగుతోది. అయితే ఇద్దరు బాలికలు బయటకు వచ్చి.. శివమూర్తి తమపై పాల్పడుతున్న దారుణాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడున్నరేళ్లగా స్వామిజీ ప్రసాదంలో మత్తు మందు కలిపి.. తమపై అత్యాచారలకు పాల్పడుతున్నట్లు బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో సదరు స్వామిజీ అసలు రంగు బయటపడింది.
ఇక పోలీసులు విచారణంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. శివమూర్తి స్వామి.. ప్రసాదం పేరు చెప్పి.. యాపిల్స్‌లో మత్తు మందు కలిపి విద్యార్థినిలకు ఇచ్చేవాడని.. అవి తిని వారు మత్తులోకి జారుకున్న తర్వాత.. బాలికపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఏళ్లుగా ఈ దారుణకాండ కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో ఇద్దరు బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేశారు. పూర్తి వివరాలతో చార్జ్ షీట్ దాఖలు చేశారు. దీనిలో సంచలన విషయాలు వెల్లడించారు.