పెద్దల సమక్షంలో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంట ఒక్క ఏడాదిలోనే విడాలకులు తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చుపెడుతున్నాయి.
భారతదేశంలో ఇప్పటికీ ఆచార సంప్రదాయాలను చాలామంది ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. వీటి వెనుక సైన్స్ కూడా దాగి ఉందని అవి పాటించాలని మన పండితులు కూడా చెబుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆచార్య వ్యవహారాలు.. సంప్రదాయాలు మూఢనమ్మకాలుగా భావించి కొట్టి పారేస్తూ ఉంటారు. భీముని అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేస్తే భార్య ఆయుష్షు పెరుగుతుందని పెద్దలు అంటుంటారు. కానీ ఓ నవవధువు అదేరోజు తన భర్తను దారుణంగా కడతేర్చింది. ఈ ఘటన బెంగళూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య అక్రమసంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణ ఘటనలు జరుగుతున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ నవవధువు భర్తను తన ప్రియుడితో కలిసి అతి దారుణంగా హతమార్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెళగావి జిల్లా వడ్డెరటి గ్రామానికి చెందిన శంకర్ సిద్దప్ప జగముత్తి(25) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ప్రియంక జగముట్టి(21) ని 5 నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనప్పటి నుంచి భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అమావాస్య సందర్భంగా శంకర్ తన భార్య ప్రియాంకతో కలిసి వడ్డెరటి గ్రామం బాణ సిద్దేశ్వర ఆలయానికి వచ్చారు. అక్కడ భర్తకు పాద పూజ చేసి ఆశీర్వాదం తీసుకుంది ప్రియాంక. గుడి నుంచి బయటకు వస్తున్న సమయంలో శ్రీధర్ అనే వ్యక్తి శంకర్ ని కత్తితో అతి దారుణంగా పొడిచి చంపి పారిపోయాడు.
భర్త చనిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది ప్రియాంక. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కి పంపించారు. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాకింగ్ నిజాలు తెలుసుకొని ఒక్కసారే నివ్వెరపోయారు. శంకర్ ని అతని భార్య ప్రియాంక స్కెచ్ వేసి మరీ చంపించింది. హంతకుడు శ్రీధర్, ప్రియాంక స్కూల్ వయసు నుంచే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా పెద్దలు అంగీకరించలేదు. అదే సమయంలో 2023 మార్చి 19న శంకర్ తో ప్రియాంక వివాహం జరిపించారు. అప్పటి నుంచి భర్తను అడ్డుతొలగించుకోవాలని అతనితో ప్రేమగా నటిస్తూ సమయం కోసం ఎదురు చూసింది ప్రియాంక. ఈ నేపథ్యంలోనే భీముని అమావాస్య రోజున భర్తకు పాద పూజ చేసిమరీ ప్రియుడితో చంపించింది. ప్రస్తుతం పోలీసులు ప్రియాంక, శ్రీధర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.