ఆ దంపతులకు చాలా ఏళ్ల కిందటే వివాహమైంది. వీరి కాపురం బాగానే సాగుతున్నా పిల్లలు మాత్రం కలగలేదు. దీంతో ఆ దంపతులు కుమిలిపోతూ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కనిపించిన చెట్టును, పుట్టను మొక్కితే అలా 15 ఏళ్లకు ఓ కూతురు జన్మించింది. దీంతో ఆ తల్లిదండ్రుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అలా కొంతకాలానికి వారి కూతురు పెరిగి పెద్దదైంది. అయితే ఇటీవల బయటకు వెళ్లిన కూతురు ఇంటికి రాలేదు. ఎక్కడకు వెళ్లింది అని తెలుసుకునే ప్రయత్నంలోనే చనిపోయిందనే వార్త అందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లోకిని జంపయ్య– రాజేశ్వరీ దంపతులది కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తి కాగా బతుకు దెరువు కోసం తిమ్మాపూర్ వచ్చి అక్కడే నివాసం ఉంటున్నారు. స్థానికంగా ఈ దంపతులు కూలీపనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. పెళ్లైన 15 ఏళ్లకు శివాని అనే కూతురు జన్మించింది. అయితే కూతురు శివాని తల్లి పని చేస్తున్న ప్రదేశానికి వెళ్లాలనుకుని రోడ్డు వెంట నడుస్తూ వెళ్తోంది. ఇక ఈ క్రమంలోనే అలుగునూరు నుంచి తిమ్మాపూర్‌కు వస్తున్న ఇదే గ్రామానికి చెందిన అట్ల సంతోశ్, శ్రీధర్, డేవిడ్ మద్యంమత్తులో కారుతో శివానిని వెనకనుంచి వేగంగా ఢీకొట్టారు.
ఇది కూడా చదవండి: Bihar: హేయ్.. నేను దుర్గామాతను, పోలీసులకు చుక్కలు చూపించిన మహిళ.. వీడియో వైరల్!
ఈ ప్రమాదంలో శివాని గాల్లోకి ఎగిరి నడిరోడ్డుపై పడింది. దీనిని గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే శివాని మరణించింది. కూతురు మరణావార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ప్రమాద ఘటన దృశ్యాలు స్థానికంగా ఉండే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.