కటిక పేదరికంలో ఉన్న ఆ యువతి ఉన్నత చదువులు చదివి గొప్ప ప్రయోజకురాలిగా అవ్వాలని కలలు కనింది. ఇందు కోసం ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో చేరింది. జీవితంలో ఏదో సాధించాలని కలలు కన్న ఆ యువతి హస్టల్ లోనే శవమై తేలింది. తాజాగా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఆ వెల్ఫేర్ హాస్టల్ లో ఏం జరిగింది? యువతి మరణించాడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కరీంనగర్ జిల్లా ఆసిఫాబాద్ మండలం బూరుగూడలోని ప్రభుత్వ డిగ్రీ వెల్ఫేర్ హాస్టల్ లో సంగీత అనే యువతి డిగ్రీ చదువుతోంది. అయితే గత కొన్ని రోజల నుంచి ఆ యువతి తీవ్రమైన విష జ్వరంతో బాధపడినట్లు తెలుస్తుంది. దీంతో ఉన్నట్టుండి ఆ యువతి పరిస్థితి విషమంగా మారడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన ఆ యువతి తాజాగా ప్రాణాలు కోల్పోయింది. అనంతరం హాస్టల్ సిబ్బంది ఆ యువతి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ కు చేరుకున్నారు.
మరణించిన కూతురు సంగీతను తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మా అమ్మాయి మరణించిందని యువతి కుటుంబ సభ్యులు, విద్యార్థి యువజన సంఘాలు ధర్నాకు దిగాయి. గత కొన్ని రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులు మృతిచెందినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి సంగీత మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.