ఓ యువకుడిని నమ్మించి ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంది. దీనికి తల్లిదండ్రులను కూడా ఒప్పించింది. ఆ యువతితో పెళ్లికి యువకుడి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మరి కొన్ని రోజుల్లొ పెళ్లి. కట్ చేస్తే.. యువకుడు చేసిన పనిక అంతా రివర్స్ అయింది. అసలేం జరిగిందంటే?
ఈ యువతి పేరు రజిత, వయసు 19 ఏళ్లు. చదువుకునే రోజుల్లో ఆమెకు వెంకటేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు కొన్నాళ్ల పాటు మాట్లాడుకున్నారు. అలా వీరి పరిచయం చివరికి ప్రేమించుకునేదాక వెళ్లింది. అలా వీరి ప్రేమాయణం ఏకంగా 3 ఏళ్ల పాటు కొనసాగింది. ఇక ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో పెళ్లికి అంగీకరించారు. దీంతో ఇరువురి తల్లిదండ్రులు పెళ్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి. కట్ చేస్తే.. ప్రియుడు చేసిన పనికి యువతి షాకింగ్ డెసిషిన్ తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో రెడ్డి రజిత (19) అనే యువతి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. అయితే ఈ అమ్మాయికి చదువుకునే రోజుల్లో మల్లాపూర్ గ్రామానికి చెందిన పల్లె వెంకటేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. కొన్ని రోజులు మాట్లాడుకుని చివరికి ప్రేమించుకున్నారు. అలా వీరి ప్రేమాయణం ఏకంగా 3 ఏళ్లు కొనసాగింది. ఇదే విషయం యువతి ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకోవాలంటూ వెంకటేష్ ను కోరారు. మొదట్లో వ్యతిరేకించిన కట్నం ఆశతో చేసుకుంటానని అన్నాడు. ఇక ఇరువురి తల్లిదండ్రుల ఆమోదంతో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి బట్టలు కూడా కొనుగోలు చేశారు.
ఇక ఉన్నట్టుండి ప్రియుడు వెంకటేష్ రజితతో పెళ్లికి నో చెప్పాడు. దీంతో రజిత తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆ యువతి ఏప్రిల్ 25న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రజిత శుక్రవారం రాత్రి కన్నుమూసింది. రజిత చనిపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.