సమాజంలో కొందరు దుర్మార్గులు విర్రవీగి ప్రవర్తిస్తూ దారుణాలకు కాలు దువ్వుతున్నారు. మైనర్ బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ 13 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఏం జరిగిందంటే?
ఇది కూడా చదవండి: వైరల్: పేలిన జేసీబీ టైర్.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరారు.. ప్రాణాలు కోల్పోయారు
కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల మైనర్ బాలిక తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. అయితే ఇదే ప్రాంతానికి చెందిన 45 సంవత్సరాల వ్యక్తి ఆ బాలికపై ఓ కన్నేసి ఉంచాడు. దీంతో అప్పటి నుంచి ఆ మైనర్ బాలికను బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. అలా కొన్నాళ్ల పాటు ఈ దారుణానికి ఒడిగట్టడంతో సదరు బాలిక గర్భం దాల్చింది.
చివరికి ఈ విషయం బాలిక తల్లిదండ్రులు తెలిసింది. ఇక పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితి పెట్టించారు. గ్రామస్థుల తీర్మానంలో భాగంగా అబార్షన్ చేయించి , బాలిక కుటుంబానికి పరిహారంగా రూ .30 వేలు అప్పజెప్పాడని తెలుస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.