అతడో రియల్ ఎస్టేట్ వ్యాపారి. భూములు కొనుగోలు, అమ్మకాలు చేస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఓ సీఐ భూమిని అమ్మిస్తానంటూ ఒప్పించాడు. కట్ చేస్తే.. నా చావుకి అతడే కారణం అంటూ సూసైడ్ నోట్ లో రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే అంశం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరో విషయ ఏంటంటే? అతడు చనిపోయే మందు సూసైడ్ నోట్ లో తన చావుకి గల కారణాన్ని రాశాడు. ఇదే ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. అతని సూసైడ్ నోట్ చదివిన పోలీసు అధికారులకు చెమటలు పడుతున్నాయి. దీంతో పాటు ఈ అంశం ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ లో సైతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. అసలు అతడు రాసిన సూసైడ్ నోట్ లో ఏముంది? అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామం. ఇక్కడే బొడిగ శ్యామ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇదే ప్రాంతంలో గోపికృష్ణ అనే వ్యక్తి సెంట్రల్ ఇంటలిజెన్స్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ బాగానే కూడబెట్టి స్థానికంగా 30 గజాల భూమిని కొనుగోలు చేశాడు. అయితే ఈ క్రమంలోనే గోపికృష్ణకు బొడిగ శ్యామ్ పరిచయం అయ్యాడు. అలా కొంత కాలానికి 30 గజాల భూమిని అమ్మి 10 లక్షల లాభం వచ్చేలా చూస్తానని వ్యాపారి బొడిగ శ్యామ్ సీఐ గోపికృష్ణకు హామీ ఇచ్చాడు. దీనికి అతడు సరేనన్నాడు. కానీ, కొన్ని పరిస్థితుల దృష్ట్యా శ్యామ్ ఆ సీఐ భూమిని అమ్మడం కుదరలేదు.
ఇదే విషయమై గత కొన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో సీఐ గోపికృష్ణ బొడిగ శ్యామ్ ను వేధించినట్లు సమాచారం. నా చావుకి కారణం సీఐ గోపిసార్. మొత్తం వివరాలు 2023 డైరీలో రాశానంటూ.. బొడిగ శ్యామ్ సూసైడ్ నోట్ లో రాసి నెల 21న ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత శ్యామ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడి సూసైడ్ నోట్ లో సీఐ గోపికృష్ణ పేరు రాయడంతో స్థానికంగా సంచనంగా మారడంతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ లో సైతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.