ఈ యువకుడు ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మయికి కూడా అతడు నచ్చడంతో ఇద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇదే విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇటీవల మరోసారి మాట్లాడాలని తీసుకెళ్లి..!
ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుల్లో పెద్దలు కుదర్చిన పెళ్లి కన్నా ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది నచ్చని అమ్మాయి తరుఫు కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడిని కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇవ్వడం, లేదంటే హత్య చేయడం చేస్తున్నారు. ఇలాంటి దారుణాలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడిని కొందరు దుండగులు కొట్టి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
అది కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం లింగంపేట. ఇదే గ్రామంలో బండారి శివ (19) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడికి ఎనుగంటి గ్రామానికి చెందిన ఓ యువతితో పరిచయం ఉంది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారడంతో గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇదే విషయం ఇటీవల యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. అలా కొన్ని రోజుల పాటు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఇదిలా ఉంటే ఈ నెల 12న కొరెం గ్రామంలో బీరప్ప జాతర జరిగింది. అక్కడికి ఆ యువతితో శివ కుడా వెళ్లాడు. ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. ఇదే విషయం యువతి బంధువులకు తెలిసింది. పట్టరాని కోపంతో ఊగిపోయిన ఆ అమ్మాయి బంధువులు.. మాట్లాడాలంటూ శివను తమ వెంట తీసుకెళ్లారు.
అనంతరం అక్కడికి వెళ్లాక ఆ యువకుడికి అతిగా మద్యం తాగించి అతడిపై దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న శివ కుటుంబ సభ్యులు వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శివ ఆదివారం ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణంతో అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. మృతుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా కుమారుడిని యువతి కుటుంబ సభ్యులే హత్య చేశారని, నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ప్రేమించాడని కొట్టి చంపిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.