kamareddy: కామారెడ్డి జిల్లా రామాయం పేటలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు మరో ఆరుగురిని కారణంగా చూపుతూ ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లీ,కొడుకుల అంతిమయాత్రలో పెను దుమారం చెలరేగింది. కుటుంబసభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్న జనం, బీజేపీ కార్యకర్తలు మున్సిపల్ ఛైర్మన్ ఇంటిని ముట్టడించారు. కుటుంబసభ్యులు రెండు మృతదేహాలను మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లోకి తీసుకెళ్లారు. అక్కడే ఉంచి ధర్నా చేపట్టారు. కుటుంబానికి న్యాయం జరగాలంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు మున్సిపల్ ఛైర్మన్ ఇంటిపై రాళ్ల దాడి చేశారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికి వారి వల్ల కావటం లేదు.
కాగా, తమ చావుకు ఏడుగురు వ్యక్తులు కారణమంటూ రామాయం పేటకు చెందిన తల్లీ,కొడుకులు పద్మ, సంతోష్‌లు శనివారం ఉదయం ఓ లాడ్జీలో ఆత్మహత్య చేసుకున్నారు. రామాయం పేట మున్సిపల్ ఛైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్‌ల వేధింపుల వల్లే చనిపోతున్నట్లు ఓ సూసైడ్ నోట్‌తో పాటు వీడియో తీసుకున్నారు. వ్యాపారంలో 50 శాతం వాటా ఇవ్వాలని రామయం పేట మున్సిపల్ ఛైర్మన్ బెదిరించాడని మృతుడు తెలిపాడు. ఫేస్‌బుక్ పోస్టు పెట్టానని గతంలో పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించారని వెల్లడించాడు. మున్సిపల్ ఛైర్మన్‌తో కలిసి అప్పటి రామాయం పేట సీఐ నాగార్జున గౌడ్ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి : లాడ్జీలో తల్లీ,కొడుకు ఆత్మహత్య.. సూసైడ్ నోట్, వీడియోలో..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.