వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చడంతో ప్రేమించుకున్నారు. కలకాలం ఒకరికొకరు తోడు నీడగా ఉండాలనుకున్నారు. దీంతో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇక ఇందులో భాగంగా వీరి పెద్దలను ఒప్పించి మరీ ఘనంగా వివాహం చేసుకున్నారు. అలా పెళ్లై ఏళ్లు దాటుతున్న వీరి ప్రేమ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. కొంత కాలం తర్వాత ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. పిల్లా పాపలతో వీరి జీవితం ఊహించలేని ఆనందంగా సాగుతూ వస్తుంది. ఈ క్రమంలో విధి వీరిని వెక్కిరించింది.
అయితే అనుకోని ప్రమాదంలో భర్త మరణించాడు. కలకాలం తోడు నీడగా ఉంటాడుకున్న భర్త అందనంత తీరానికి వెళ్లిపోయాడు. ఇక భర్త రాడు, కనిపించడు అన్న చేదు నిజాన్ని ఆ మహిళ జీర్ఱించుకోలేకపోయింది. గుండెల నిండా మోయలేని భారాన్ని మోస్తూ గుండెలు పగిలేలా ఏడ్చింది. ఇక భర్త లేని ఈ జీవితంలో నేను ఉండలేను అని… ఆ మహిళ కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. గుండెల్ని పిండెసేలా ఉన్న ఈ విషాద ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది కామారెడ్డి జిల్లా రాజంపేట గ్రామం. మెత్తల అశోక్ (31), భార్గవి (27) దంపతులు. వీరు 4 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలం పాటు వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగింది. అయితే నాలుగు ఏళ్లు తిరిగే సరికి ఈ దంపతులకు కూతురు ధ్వనిక (3), కుమారుడు అద్వైత్ (1) జన్మించారు. భర్త అశోక్ ఉన్న ఊరిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య భార్గవి కూడా వ్యవసాయ పనుల్లో భర్తకు ఆసరాగా నిలిచేది. దీంతో వీరి కాపురం పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే వీధి వీరిని వెక్కిరించింది. అసలు ఏం జరిగిందంటే?
గత నెల 21న పశువులకు నీళ్ల కోసమని అశోక్ నీళ్ల బావిలోకి దిగి కాలు జారి కిందపడి చనిపోయాడు. భర్త చనిపోయాడన్న విషయం తెలుసుకున్న భార్య భార్గవి గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువుల అంతా అశోక్ మరణవార్త విని ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి అశోక్ అంత్యక్రియలు జరిపారు. కానీ భర్త చనిపోవడంతో భార్య భార్గవికి ఇది కలనా లేక నిజమా అనేది అస్సలు అర్థం కావడం లేదు. ఇదంతా కల అయితే బాగుండి తరుచు బాధపడుతూ ఉండేది. ఇక భర్త రాడు, కనిపించడు అన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక భార్గవి ఏడుస్తూ ఉండేది.
అలా కొన్ని రోజులు గడిచింది. భార్గవి భర్త లేని ఈ లోకంలో నేను ఉండలేను అనుకుంది. ఇందులో భాగంగానే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భార్గవి తల్లిదండ్రులు, అశోక్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక అశోక్, భార్గవి చనిపోవడంతో పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు. తల్లి శవంపై పడి పిల్లలు అమ్మా.. లే అంటూ ఏడ్చిన దృశ్యం పలువురుని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.