చంపుతవా, నన్ను చావమంటావా..? ఓ మహిళ కట్టుకున్న భర్తను హత్య చేయాలంటూ తమ్ముడికి చెబుతున్న మాటలు ఇవి. అక్క మాటలను కాదనని తమ్ముడు బావను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు తాళి కట్టిన భర్తను భార్య హత్య చేయడానికి కారణం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం షేకపూర. ఇదే గ్రామానికి చెందిన బోయినివార్ మొగులజీ, శోభబాయి భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం కాగ ఓ కూతురు కూడా ఉంది. ఈ మధ్య కాలంలోనే తమ కూతురికి పెళ్లి కూడా చేశారు. అయితే బతుకుదెరువు కోసమని ఈ దంపతులు జగిత్యాలలోని ఇబ్రహీంపట్నం గ్రామానికి వెళ్లి అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఆగస్టు 15న కూతురు శ్రీమంతం ఉండడంతో దంపతులిద్దరూ కోటగిరికి చేరుకున్నారు. శ్రీమంతం అనంతరం ఈ దంపతులు మిర్జాపూర్ చేరుకున్నారు. ఇక ఇక్కడికి చేరుకున్నాక భర్త మొగులాజీ భార్యపై కోపంతో అందరికీ ముందు కాస్త దరుసు ప్రవర్తనతో చెలరేగాడట. దీంతో కోపంతో ఊగిపోయిన భార్య శోభబాయి ఎలాగైన సరే నా భర్తను హత్య చేయాలనే ప్లాన్ గీసింది. ఇందులో భాగంగానే భర్తను చంపేందుకు వరసకు తమ్ముడయ్యే సంతోష్ తో మాట్లాడింది. బావను హత్య చేయాలని చెప్పడంతో ముందుగా సంతోష్ వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. అయినా మొగులజీ ప్రవర్తనలో మార్పు రావడం లేదని శోభ,సంతోష్ గ్రహించారు.
అయితే శనివారం బావమరిది సంతోష్ బావ మొగులజీకి ఫోన్ చేసి స్థానికంగా ఉండే ద్వారకానగర్ వెంచర్ లోకి రావాలంటూ కబురు పంపాడు. బావ మరిది పిలిచాడని మొగులజీ ప్రేమతో అక్కడికి వెళ్లాడు. శోభ తమ్ముడు సంతోష్ తో పాటు మరో తమ్ముడు కూడా వెంటవచ్చారు. అనంతరం ముగ్గురు కలిసి మద్యం తాగారు. మొగులజీ ఫుల్ గా మత్తులోకి జారుకున్నాక సంతోష్ అతని తమ్ముడు కలిసి బావను దారుణంగా హత్య చేశారు. ఇక మొగులజీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల విచారణ చేపట్టి భర్తను చంపింది భార్య శోభనే అంటూ తేల్చారు. భార్య శోభతో పాటు ఆమె తమ్ముడు సంతోష్, మరో యువకుడిని అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.