నగల కోసం వచ్చిన ముగ్గురు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆమె వద్ద ఉన్న 4 తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు. అంతేకాకుండా ఈ దుండగులు మరో కిరాతకానికి పాల్పడ్డారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఈ మధ్యకాలంలో దొంగలు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా రోడ్లపై కనిపించే పెళ్లైన మహిళలనే టార్గెట్ గా చేసుకుని చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఇకపోతే తాజాగా ముగ్గురు దొంగలు దారుణంగా వ్యవహరించారు. ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లి బంగారు అభరణాలు దొంగిలించారు. అంతటితో సరిపెట్టకుండా ఊహించని కిరాతకానికి పాల్పడ్డారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామం. ఇక్కడే నర్సవ్వ అనే మహిళ నివాసం ఉండేది. అయితే ఇటీవల ముగ్గురు దొంగలు ఆమెపై కన్నేశారు. ఎలాగైన ఆమె వద్ద ఉన్న నగలను దొంగిలించాలని అనుకున్నారు. ఇక పక్కా ప్లాన్ తోనే ఆ ముగ్గురు దొంగలు సమయం చూసి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న 4 తులాల బంగారం, 10 తులాల వెండిని అపహరించారు. అంతేకాకుండా ఈ దుండగులు మరో దారుణానికి పాల్పడ్డారు. దొంగిలించే క్రమంలో ఆ మహిళ అడ్డుపడడంతో ముగ్గురు దొంగలు కలిసి ఆ మహిళను దారుణంగా హత్య చేశారు.
అనంతరం ఆ మహిళ శవాన్ని డ్రమ్ములో కుక్కి గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి చెరువులో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఆ చెరువులో ఆ మహిళ శవం పైకి తేలింది. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. నగల కోసం ఓ మహిళను దారుణంగా హత్య చేసిన దుండగుల కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.