ఈ మద్య కొంత మంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం బ్యూటీ పార్లర్, మసాజ్ సెంటర్ల ముసుగులో అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఉపాధి కోసం వచ్చిన అమ్మాయిలు.. సర్వం కోల్పోయిన ఆడవాళ్లను వాళ్లు టార్గెట్ చేసుకొని ఈ పాడు పనికి పురమాయిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు.
తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గుట్టుగా సాగుతున్న వ్యభిచార దందా గుట్టురట్టు చేశారు పోలీసులు. కాకినాడ సిటీలో ఇళ్ల మద్య అద్దెకు తీసుకొని ఇతర ప్రాంతాల నుంచి కొంత మంది ఆడవాళ్లను తీసుకు వచ్చి గుట్టుగా ఈ దందా కొనసాగిస్తున్నారు. నేరం అనేది ఎప్పటికీ దాగదు.. వీరి భాగోతం చూసి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు పకడ్భందీగా ప్లాన్ చేసి సడెన్‌గా దాడి చేశారు. అయితే దీని వెనుక ఉన్న వారి గురించి వివరాలు సేకరించి షాక్ అయ్యారు పోలీసులు. ఈ మొత్తం వ్యభిచార దందా నిర్వహిస్తోంది ఓ మహిళ అని పోలీసులు నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లంరాజు నగర్ శివారులో ఓ మహిళ ఇల్లు అద్దెకు తీసుకుంది.
కొన్నాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. మహిళ చేస్తున్న నిర్వాకంపై చుట్టు పక్కల వాళ్లకు అనుమానం రావడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సదరు మహిళ నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా వ్యభిచారం కోసం తీసుకొచ్చిన ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను ముగ్గురు విటులను అరెస్టు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారం పై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.