ఏపీలోని కాకినాడలో గత రెండు నెలల కిందట పబ్లిక్ ప్రాసిక్యూటర్ మహ్మద్ అక్బర్ అనే వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. అయితే మొదటగా ఇతని మరణం కుటుంబ సభ్యులు అంతా సహజ మరణంగానే భావించారు. తీరా రెండు నెలలు తిరిగే సరికి మహ్మద్ అక్బర్ మరణంలో భార్య పాత్ర ఉందన్న అనుమనంతో మహ్మద్ అక్బర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా భర్త హత్యలో భార్య పాత్ర కీలకంగా ఉందని పోలీసులు వెల్లడించారు. అసలు విషయం తెలుసుకున్న మహ్మద్ అక్బర్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కోడలు ఇంత పని చేసిందా అంటూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
అసలేం జరిగిందంటే? అది ఏపీలోని కాకినాడ, మసీదు సెంటర్. ఇదే ప్రాంతంలో మహ్మద్ అక్బర్ అనే వ్యక్తి కాకినాడ ప్రత్యేక పోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేస్తున్నాడు. ఇతను గతంలో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాక ఓ కూతురికి జన్మనిచ్చిన భార్య మరణించడంతో యానాంకు చెందిన మహ్మదున్నీసాబేగంను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించారు. అయితే గతంలో భర్త మహ్మద్ అక్బర్ రెండవ భార్య మహ్మదున్నీసాబేగం వాడిన పాత ఫోన్ ను తన తండ్రికి ఇచ్చి భార్యకు కొత్త ఫోన్ కొనిచ్చాడు. అయితే వీరు నివాసం ఉంటున్న అపార్ట్ మెంటులోనే రాజస్థాన్ కు చెందిన రాజేష్ జైన్, కిరణ్ లతో మహ్మదున్నీసాబేగంకు పరిచయం ఉంది.
కాగా భర్తను చంపాలని అనుకున్న భార్య ఆ ఇద్దరి సహకారాన్ని కోరింది. మహ్మదున్నీసాబేగం కోరిక మేరకు వాళ్లు కూడా అక్బర్ ను చంపేందుకు ముందుకొచ్చారు. జూన్ 23వ తేదీన ఆ రోజు రాత్రి భర్త అక్భర్ జోరుగా నిద్రిస్తుండగా క్లోరోఫాంను ఓ గుడ్డలో వేసి దానిని భర్త మహ్మద్ అక్బర్ ముక్కు వద్ద ఉంచారు. అందులో మత్తు పదార్థం ఎక్కువగా ఉండడంతో మహ్మద్ అక్బర్ ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు అక్భర్ మరణించడతో తల్లిదండ్రులతో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏం జరిగిందని భార్య మహ్మదున్నీసాబేగంను అడగగా ఏం జరగలేదని అతనిది సహజ మరణమే అంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.
మహ్మద్ అక్బర్ కుటుంబ సభ్యులు సైతం భార్య చెప్పింది నిజమేనని అనుకున్నారు. ఇక తీరా 59 రోజులు గడిచాక భార్య మహ్మదున్నీసాబేగం వాడిన పాత ఫోన్ లో అపార్ట్ మెంటులోని ఉంటున్న రాజేష్ జైన్, కిరణ్ లతో చేసిన చాటింగ్ ను అక్బర్ తల్లిదండ్రుల కంట పడింది. దీంతో కోడలిపై అనుమానంతో అక్బర్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య మహ్మదున్నీసాబేగంను విచారించారు. విచారణలో భాగంగానే శనివారం జీజీహెచ్ ఫెరెన్సిక్ వైద్యులు సైతం శవానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. దీంతో ఎట్టకేలకు పోలీసుల విచారణలో భార్య మహ్మదున్నీసాబేగం తన నిజాన్ని ఒప్పుకోవడంతో.., ఆమెతో పాటు రాజేష్ జైన్, కిరణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆలస్యంగా అసలు నిజాలు వెలుగులోకి రావడంతో అక్బర్ కుటుంబ సభ్యులు షాక్ లో మునిగితేలారు. భార్య ఇంత పని చేసిందా అని నమ్మకలేకపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.