మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు టెక్నాలజీ సాయంతో ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలోని కడపలో చోటు చేసుకున్న ఘటనలో ఏకంగా పది మందని మోసం చేస్తూ అడ్డంగా దొరికారు. పోలీసులు తెలిపన పథకం ప్రకారం.. జోయల్, సదా, శాంతి అనే ముగ్గురు దుండగులు రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏకంగా పది మందని మోసం చేశారు. రైల్వే డిపార్ట్ మెంటులో ఉద్యోగాలకు ఇప్పిస్తామని కడప జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన ఓ 10 మందిని నమ్మించారు.
ఇది కూడా చదవండి: Jagtial Crime: MRO, SI, MPOపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పంటించిన రైతు
నిజమేనని భావించిన బాధితులు ఒక్కొక్కరు సుమారుగా రూ.3 లక్షల వరకు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రోజుల తర్వాత మేము మెసపోయామని గ్రహించి డబ్బులు తిరిగే ఇవ్వమని అడిగారు. దీంతో మాయమాటలు చెప్పిన ఆ దుండగులు ఇటీవల రెండు మూడు రోజుల నుంచి కనిపించకుండా పరారయ్యారు. దీంతో షాక్ కు గురైన బాధితులు మాకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.