ఈ మధ్యకాలంలో పెళ్లైన చాలా మంది కట్టుకున్న వాళ్లను కాదని పరాయి సుఖం పాకులాడుతున్నారు. సొంతింటి కూర కన్నా పక్కింటి పుంటికూరు రుచి అమోగం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వావివరసలు మరిచిపోయి క్షణికసుఖం అడ్డదారులు తొక్కి చివరికి వివాహ బంధానికి తూట్లు పొడుస్తున్నారు. ఇలా చాలా మంది కట్టుకున్నవాళ్లని కాదని చీకటి కాపురాలు నడిపిస్తూ చివరికి అసలు నిజాలు బయటపడడంతో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ పెళ్లికాని అల్లుడిపై మోజుపడింది. కొంత కాలం పాటు అతనితో శారీరకంగా కలుసుకుని ఎంజాయ్ చేసింది. తీరా అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసే సరికి షాక్ కు గురై ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
వైఎస్సార్ కడప జిల్లా రాజుపాలెం ప్రాంతం. ఇక్కడే పర్లపాడు నరసమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఇమెకు గతంలో వివాహం జరిగి ఓ కూతురు, కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నాళ్ల కిందట భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి నరసమ్మ కూతురు, కుమారుడిని పెంచి పెద్ద చేసింది. ఇక కూతురుకి పెళ్లి వయసు రావడంతో అదే గ్రామానికి చెందిన మిద్దె పెద్దదస్తగిరి అనే యువకుడికి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేసింది. అలా కొన్నాళ్ల పాటు కూతురు జీవితం సంతోషంగానే సాగుతూ వచ్చింది. అయితే నరసమ్మ అప్పుడప్పుడు కూతురు ఇంటికి వెళ్తుండేది. ఈ క్రమంలోనే కూతురు మరిది అయిన చిన్న దస్తగిరితో నరసమ్మ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే నరసమ్మ వావివరసలు మరిచి పెళ్లికాని అల్లుడితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది.
అత్త కూడా ఎర్రగా బుర్రగా ఉండడంతో ఆ కుర్రాడు కమిట్ అయిపోయాడు. అలా కొంతకాలం పాటు వీరిద్దరూ సమయం దొరికినప్పుడల్లా శారీరకంగా కలుస్తూ తెగ రొమాన్స్ చేస్తున్నారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఈ క్రమంలోనే చిన్న దస్తగిరికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అత్త నరసమ్మ ఒంటికాలుపై లేచి ప్రియుడిపై కోపం పెంచుకుంది. ఇక పరుగు పరుగున నరసమ్మ ప్రియుడు ఇంటికి వెళ్లి.. నేను ఉండగా మరో పెళ్లి చేసుకుంటావా అని పెద్ద గొడవలు చేసింది. ఇంతటితో ఆగని నరసమ్మ తన వెంట తెచ్చుకున్న కత్తితో అందరూ చూస్తుండగానే ప్రియుడు చిన్నదస్తగిరిపై దాడి చేసింది. ఈ దాడిలో చిన్నదస్తగిరి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కొడుకు రక్తపు మడుగులో పడి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు నరసమ్మ ను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.