ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన ఏడాదికే 8 నెలల గర్భిణి భార్యతో కలిసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో మృతుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అసలేం జరిగిందంటే?
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిండు గర్భిణి భార్యతో కలిసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నట్టుండి ఈ భార్యాభర్తలు బలవన్మరణానికి పాల్పడడంతో ఇరువురి కుటంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన ఏడాదికే దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. కడప పట్టణంలోని విజయదుర్గా కాలనీలో సాయికుమార్ రెడ్డి-హేమమాలిని దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతేడాది వివాహ జరిగింది. దీంతో అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు ఎంతో సంతోషంగా కాపురాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం హేమమాలిని 8 నెలల గర్భవతి కావడం విశేషం. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ దంపతులు ఆర్థికం సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ దంపతులు మంగళవారం రాత్రి కనుమలోపల్లిలో ఉన్న రైలు పట్టాలపై పడుకుని ఈ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
దీనిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ దంపతుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. కాగా, పెళ్లైన ఏడాదికే ఉన్నట్టుండి ఈ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమా? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఈ దంపతుల షాకింగ్ డెసిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.