Jubilee Hills: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టాడు. ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూబ్లీహిల్స్ ఎస్పీఆర్ హిల్స్‌కు చెందిన అనిల్ కుమార్‌కు 9 నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం మొదలయ్యాయి. నెల రోజుల క్రితం గొడవ కారణంగా అనిల్ ఇంటినుంచి పారిపోయాడు. పెద్దలు అతడ్ని తీసుకువచ్చి భార్య భర్తల మధ్య సఖ్యత కుదర్చారు. కొన్ని రోజులు బాగానే ఉన్న ఇద్దరి మధ్యా మళ్లీ గొడవలు మొదలయ్యాయి.
ఈ నేపథ్యంలో బుధవారం అనిల్ తన భార్యను హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, డ్రమ్ములో కుక్కాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. ఆమె కనిపించకుండా పోవటంతో కుటుంబసభ్యులు వెతకటం మొదలుపెట్టారు. సోమవారం డ్రమ్ములో తమ కూతురి శరీరా భాగాలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రమ్ములో ఉన్న శరీరభాగాల్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Chennai: టీవీ చూడొద్దన్న తల్లి..! కూతురు చేసిన పనికి అంతా షాక్!