john wayne gacy: అతనో సాధారణ మధ్య తరగతి వ్యక్తి. పని, ఇళ్లు తప్ప ఏమీ తెలియని అమాయకుడు. అందర్నీ నవ్వించే ఓ జోకర్. ఇది అప్పటివరకు జాన్ వేన్ గేసిపై అతడికి పరిచయం ఉన్న వారి అభిప్రాయం. 1978, డిసెంబర్ 11 తర్వాత అతడి నిజస్వరూపం తెలిసి అతడి పరిచయస్తులంతా బిత్తరపోయారు. ‘‘ ఇన్నాళ్లు మన మధ్య అమయాకుడిలా తిరిగింది ఓ నరరూప రాక్షసుడా..’’ అని భయపడిపోయారు. 33 మందిని అతి దారుణంగా హత్య చేసిన అతడివైపు అమెరికా మొత్తం తిరిగిచూసింది. 1972లో మొదలైన అతడి మారణహోం 1978 వరకు కొనసాగింది.
వివరాల్లోకి వెళితే.. జాన్ వెన్ గేసీ అమెరికాలోని చికాగోలో 1942 మార్చి 17న జన్మించాడు. జాన్ స్టాన్‌లీ గేసీ, మారియాన్ ఈలైన్ దంపతులకు రెండో సంతానం. గేసీకి ఓ అక్క, ఓ చెల్లెలు ఉన్నారు. చిన్నతనంలో తాగుబోతైన తండ్రి కారణంగా ఎన్నో బాధలను అనుభవించాడు. 1949లో మొదటి సారి స్నేహితుడితో కలిసి ఓ యువతిపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయం తెలిసిన తండ్రి అతడ్ని తీవ్రంగా కొట్టాడు. ఇక, అప్పటినుంచి అలాంటి వాటికి దూరంగా ఉండేవాడు. 1963లో బిజినెస్ డిగ్రీలో పట్టా పొందాడు. తర్వాత ఓ షూ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా చేరాడు. 1964 ఏప్రిల్ నెలలో రెండోసారి శృంగార అనుభవాన్ని పొందాడు. ఓ వ్యక్తితో శృంగారంలో పాల్గొన్నాడు. అదే సంవత్సరం మార్లిన్ మైయర్స్ అనే ధనవంతుడి బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఆమె తండ్రి ఓ మూడు కేఎఫ్‌సీ రెస్టారెంట్లను కొని అతడికి అప్పగించాడు. జేసీ వాటి బాధ్యత చూసుకునేవాడు. కొన్ని నెలల తర్వాత అతడు తన ఇంటిని వాటర్‌లూకు మార్చాడు.
వాటర్‌లూలోని తన ఇంట్లో ఓ క్లబ్‌ను ఏర్పాటు చేసి, ఆ క్లబ్‌కు వచ్చేవారికి ఉచితంగా మందు పోసేవాడు. జేసీకి ఆడవాళ్లతో శృంగారం చేయాలన్న కోరిక అప్పటికే చచ్చిపోయింది. మగవాళ్లపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. అయితే, ఎవ్వరికీ అనుమానం రాకుండా తన రెస్టారెంట్లో ఆడ,మగ ఇద్దరికీ ఉద్యోగాలు ఇచ్చాడు. అది కూడా యవ్వనంలో ఉన్నవారికి మాత్రమే ఇచ్చాడు. కానీ, ఎక్కువగా అబ్బాయిలతో మాత్రమే తిరిగేవాడు. తన కోర్కెలు తీరిస్తే మందు పోస్తానని వారికి చెప్పేవాడు. అందుకు ఒప్పుకుంటే వారితో శృంగారం చేసేవాడు. ఇదేంటని నిలదీస్తే.. తాను జోక్ చేశానని చెప్పి తప్పించుకునేవాడు. తన భార్యను ఇతరులతో శృంగారం చేయమని బలవంతం చేసేవాడు. భర్త పోరు వల్ల ఆమె అందుకు ఒప్పుకునేది.
1967లో గేసీ తన ఫ్రెండ్ కుమారుడైన 15 ఏళ్ల పిల్లాడి మాయ మాటలు చెప్పి, అతడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పిల్లాడు కొన్ని నెలలు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా ఆగిపోయాడు. గేసీ మీద కోపంతో 1968లో తనపై జరిగిన అత్యాచారాన్ని తండ్రికి చెప్పాడు. బాలుడి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గేసిని అరెస్ట్ చేశారు. గేసీ జైలులో ఉన్నపుడే అతడి భార్య విడాకులకు అప్లై చేసింది. అత్యాచారం కేసు నడుస్తుండగానే కోర్టు విడాకులు మంజూరు చేసింది. రెండేళ్ల జైలు శిక్ష అనంతరం గేసీ పేరోల్ మీద బయటకు వచ్చాడు. 1972లో కారోలే అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
కొన్ని నెలల తర్వాత వ్యాపారంతో పాటు పార్ట్‌టైం జాబ్ మొదలుపెట్టాడు. ఫ్యామిలీ, ఇతర పార్టీలలో జోకర్ వేషం వేసుకుని పిల్లలను నవ్వించేవాడు. ఇక అప్పటినుంచి అతడి పేరు‘‘పోగో అంకుల్’’గా మారింది. వీలు దొరికినప్పుడల్లా యువకులను, చిన్నపిల్లలను ఇంటికి తీసుకెళ్లి, రేప్ చేసి చంపేవాడు. వారి శవాలను ఇంటి బేస్‌మెంట్‌లో పాతి పెట్టేవాడు. ఇలా 1972నుంచి 1978 మధ్యకాలంలో 33 మందిని చంపాడు. 1978లో 15 ఏళ్ల రాబర్ట్ పీస్ట్‌ను రేప్ చేసి చంపాడు. రాబర్ట్ తల్లి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గేసీని అరెస్ట్ చేశారు. విచారణలో అతడే ఆ హత్య చేసినట్లు తేలింది. ఆ హత్యతో పాటు 33 హత్యల గురించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు విచారణలో గేసీ దోషిగా తేలాడు. 1980లో కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. 1994లో విషం ఇచ్చి అతడ్ని చంపేశారు.
అయితే, జేసీ పోలీసుల విచారణలో ఇచ్చిన వాగ్మూలాలకు సంబంధించిన వాయిస్ టేప్ రికార్డింగ్‌లను నెట్ ఫ్లిక్స్ ఓ సీరిస్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ‘Conversations with a Killer: The John Wayne Gacy Tapes’ పేరిట టీవీ సిరీస్‌ను నడిపిస్తోంది. మరి, గేసీ మారణహోమంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తమ్ముడు నన్ను చంపేస్తారు ఏమో..! కన్నీరు పెట్టించే ఓ నర్సు కథ!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.