ఆ దంపతుల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. పెళ్లైన కొంత కాలానికి ఓ కూతురు కూడా పుట్టింది. ఇక పుట్టిన కూతురిని చూసుకుంటూ ఆ భార్యాభర్తలు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. సాఫీగా సాగుతుంది అని అనుకుంటున్న తరుణంలోనే భార్య కూతురితో పాటు తంగభద్రనదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా దేవమాడ గ్రామానికి ప్రవీణ్ రెడ్డికి మమతారెడ్డి అనే మహిళతో గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ పాప కూడా జన్మించింది. పుట్టిన పాపను చూసుకుంటూ ఈ దంపతులు జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.
అయితే ఆదివారం నుంచి ఉన్నట్టుండి భార్య మమతా రెడ్డి తన నాలుగేళ్ల కూతురితో పాటు కనిపించకుండా పోయింది. ఇక రాత్రి అయినా కూడా మమతా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఖంగారుపడ్డ భర్త బంధువులందరికీ ఫోన్ చేసి భార్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు. భార్య ఆచూకి మాత్రం లభించలేదు. ఇక ప్రవీణ్ రెడ్డికి ఏం చేయాలో అర్థం కాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆదివారం మమతారెడ్డి జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ లో తన సోదరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది.
ఆ తర్వాత ఎంత ఫోన్ చేసినా మమతా లిప్ట్ చేయకపోవడంతో అనుమానమొచ్చి సోదరి పోలీసులకు సమాచారం అందించింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే తుంగభద్ర నది సమీపంలోని పుష్కర్ ఘాట్ వద్ద మమతరెడ్డి హ్యాండ్ బ్యాగు, మంగళసూత్రం, సెల్‌ఫోన్ ఉండటంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ నదిలోనే మమతా రెడ్డి దూకినట్లుగా అనుమానించిన పోలీసులు జాలర్ల సాయంతో నీటిలో గాలించారు. మమతా కూతురు మృతదేహం లభ్యమవ్వగా.. మమతా రెడ్డి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు మమతా రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు భర్తను అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.