పైన కనిపిస్తున్న వ్యక్తుల పేర్లు జమ్ములమ్మ, అర్జున్, వైషాలీ. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఎంతో సంతోషంగా బతికే ఈ ముగ్గురు ఉన్నట్టుండి ఒకే రోజు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అసలేం జరిగిందంటే?
కొడుకు పేరు అర్జున్, కోడలి పేరు వైషాలీ, తల్లి పేరు జమ్ములమ్మ. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్లుగా సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ ముగ్గురు ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వీరి మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలిచారు. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. గద్వాల టౌన్ లో జమ్ములమ్మయ (50), ఆమె కొడుకు అర్జున్ (24), కోడలు వైషాలీ (22) నివాసం ఉంటున్నారు. ముగ్గురు ఒకే ఇంట్లో సంతోషంగా బతుకుతున్నారు. అయితే వీళ్లు ముగ్గురు స్థానిక గ్రామాల్లో ఆటోలో తిరుగుతూ వంటపాత్రలు, పాత బట్టలు అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం ముగ్గురు ఆటోలో జోగులాంబ నుంచి ధరూర్ వెళ్తున్నారు. ఇక పారుచర్ల వద్దకు రాగానే వీరి ఆటోను వెనకాల నుంచి బొలెరో వాహనం వేగంగా దూసుకొచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న అర్జున్, వైషాలీ, తల్లి జమ్ములమ్మ కిందపడిపోయారు.
స్థానికులు వెంటనే గమనించి వారిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోవడంతో వారు అప్పటికే మరణించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత అంతా పరిశీలించి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒకే ఇంట్లో, ఒకే రోజు ముగ్గురు మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వీరి మరణంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఒకే ఇంట్లో ముగ్గురు మరణించిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.