తెలంగాణలో మరో దారుణం వెలుగు చూసి చూసింది. ఓ భార్య తాళికట్టిన భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భర్తను భార్య ఎందుకు చంపిందంటే?
సమాజంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రేమ, ఆర్థిక, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వంటి కారణాలతో ఎంతో మంది హత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భార్య తాళికట్టిన భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. భర్తను భార్యను దారుణంగా హత్య చేయడానికి కారణం ఏంటి? దీని వెనుక అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మొగలి రావుల చెరువు గ్రామం. ఇక్కడే మంద దేవరాజు (35) అలివేలు దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు గత కొన్నేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన చాలా కాలం వరకు ఎలాంటి మనస్పర్థలు లేకుండా సంతోషంగా కాపురాన్ని కొనసాగించారు. అలా కొన్నాళ్లకి వీరికి ఓ కూతురు, కుమారుడు జన్మించారు. ఈ దంపతులు బతుకు దెరువు కోసం కొంత కాలం పాటు ఇతర ప్రాంతాల్లోకి కూడా నివాసం ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ దంపతులు మద్యానికి అలవాటు పడి రోజూ తాగేవారు. ఇక మద్యం తాగిన సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ వాగ్వాదానికి దిగేవారట. దీంతో గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే శనివారం రాత్రి కూడా ఈ దంపతులిద్దరూ అతిగా మద్యం సేవించారు.
ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన భార్య అలివేలు.. ఇంట్లో ఉన్న గొడ్డలితో భర్తను అతి దారుణంగా హత్య చేసింది. అనంతరం.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ఆ తల్లి పిల్లలను బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దేవరాజు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మద్యం మత్తులో తాళికట్టిన భర్తను దారుణంగా హత్య చేసిన కసాయి భార్య కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.