ఆమె పేరు సరిత. వయసు 32 ఏళ్లు. దామోదర్ అనే వ్యక్తితో 12 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు కుమారులు జన్మించారు. కొన్నాళ్లకి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఈ దంపతులను పలకరించాయి. ఈ క్రమంలోనే భర్త సంపాదన సరిపోవడం లేదని సరిత ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
మధ్య తరగతి జీవితం. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎళ్ల తరబడి కాయ కష్టం చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక భర్త స్థానికంగా ఎక్కడ పని దొరికితె అక్కడికి వెళ్లేవాడు. భార్య కూడా గ్రామంలో చేను పనులకు వెళ్లేది. అలా పెళ్లైన నాటి నుంచి వీరి సంసారం ఆర్థిక ఇబ్బందులతోనే ముందుకు సాగింది. ఇక పుట్టిన పిల్లలు పెరిగి పెద్దవారవుతున్నారు. పిల్లలను చదివించే స్థోమత కూడా లేదు. ఈ క్రమంలోనే ఆమె భర్త ఉపాధి కోల్పోయాడు. భర్త సంపాదన సరిపోవడం లేదని భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం జల్లాపురం గ్రామం. ఇక్కడే దామోదర్-సరిత (32) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 12 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు కుమారులు జన్మించారు. అప్పటి నుంచి భార్యాభర్తలు ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లేవారు. అలా వీరి సంసారం ఆర్థిక ఇబ్బందులతోనే ముందుకు సాగుతూ వచ్చింది. ఇక పిల్లలు కూడా పెరిగి పెద్దవారవుతున్నారు. తోటి తల్లిదండ్రుల్లా ప్రైవేట్ స్కూల్ లో చదివించే స్థోమత లేదు. భర్త సంపాదని సరిపోవడం లేదని భార్య తరుచు బాధపడేవారు. ఈ క్రమంలోనే దామోదర్ జీవనోపాధి కోల్పోయాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఇంటి ముంగిటకు వచ్చాయి. ఉపాధి కోసం భర్త చాలా చోట్ల తిరగాడు. ఎక్కడా కూడా పని దొరకలేదు. ఈ నేపథ్యంలోనే వారి పూట గడవడమే కష్టంగా మారింది. దీనికి తోడు ఈ మధ్యకాలంలో సరిత అనారోగ్యానికి గురైంది.
ఇవన్నీ ఆలోచిస్తూ సరిత తీవ్ర మనస్థాపానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున భార్య సరిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్లారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సరిత బలవన్మరణానికి పాల్పడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడిన సరిత నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.