తెలంగాణలోని ఓ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని ఆమె కొడుకు గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
తల్లి ప్రేమ వర్ణణాతితం. నవ మాసాలు మోసి, పెగు తెంచుకుని మనకు జన్మనిస్తుంది. అన్నీచేసిన తల్లి చివరికి మంచాన పడితే నా కొడుకు చూసుకుంటాడని ఎంతో నమ్మకంతో ఉంటుంది. అలాంటి తల్లి రుణం తీర్చుకోవాల్సింది పోయి కొందరు దుర్మార్గులు కనికరం లేకుండా దారుణంగా హత్యలు చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ కొడుకు కన్నతల్లిని దారుణంగా గొడ్డలితో నరికి చంపాడు. తాజాగా తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం రామపురం. ఇదే గ్రామంలో నాగమ్మ (65) అనే మహిళ నివాసం ఉండేది. ఈమెకు రాజు అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు గతంలో బతుకు దెరువు కోసం ముంబై వెళ్లి ఈ మధ్యే ఇంటికి తిరిగి వచ్చాడు. ఇదిలా ఉంటే.. ఇటీవల రాజు తన ఇంటిముందు ఉన్న చెట్టును నరుకుతున్నాడు. దీనిని గమనించిన తల్లి నాగమ్మ.. చెట్టును నరకొద్దు అంటూ కొడుకుతో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నాడు. ఇక పట్టరాని కోపంతో ఊగిపోయిన రాజు.. చేతిలో ఉన్న గొడ్డలితో తల్లిని కనికరం లేకుండా విచక్షణారహితంగా నరికాడు.
కుమారుడి దాడిలో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నాగమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షణికావేశంలో కన్నతల్లిని గొడ్డలితో అతి కిరాతకంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.