ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. నవ జాత శిశువుని ఎలుకలు పీక్కుతిన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది. అసలు ఈ హృదయ విదారక ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది జార్ఖండ్ రాష్ట్రం గిరిదిహ్ లోని ఓ ప్రభుత్వాస్పత్రి. ధన్ బాద్ కు చెందిన మమతా దేవి అనే మహిళ ఇటీవల పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. ఏప్రిల్ 29న మమతా దేవి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఆ శిశువు పుట్టిన వెంటనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అదే ఆస్పత్రిలో ఓ వార్డ్ లో చికిత్స అందించారు. ఇక మమతా దేవి బంధువులు శిశువుని చూడటానికి వెళ్లగా అక్కడ ఎలుకలు పీక్కుతింటున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇదే విషయాన్ని ఆ ఆస్పత్రి పీడియాట్రిక్స్ విభాగం అధిపతికి తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన నవ జాత శిశువుకి అయిన లోతైన గాయాలను గుర్తించారు.
ఇది కూడా చదవండి: Rajasthan: అన్నతో పెళ్లైన చెల్లెలు పాడు పని.. భర్తకు తెలిసిందని!
ఈ ఘటన చివరికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి వరకు వెళ్లింది. వెంటనే స్పందించిన జార్ఖండ్ రాష్ట్ర ముఖ్య అదనపు కార్యదర్శి వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో పాటు ఈ ఘటనకు కారణమైన నర్సులు, డాక్టర్లను విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మాత్రం కాస్త విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ హృదయ విదారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.