కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, దిశా వంటి కఠినమైన చట్టాలు రూపొందించినా దుర్మార్గుల ఆలోచనల్లో మార్పు మాత్రం రావడం లేదు. ఆడది అందంగా కనిపిస్తే చాలు చెల్లి, అక్కా అని వరసలు మరిచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా అభం శుభం తెలియని మైనర్ బాలికలపై కొందరు దుర్మార్గులు బరితెగించి ప్రవర్తిస్తూ అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా ఓ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన జార్ఖండ్ లో తీవ్ర సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది జార్ఖండ్ లోని రాంచీ ప్రాంతం. మే 11వ తేదీ బుధవారం రాత్రి ధుర్వా రోడ్డుపై ఓ 15 ఏళ్ల బాలికపై నడుకుంటూ వెళ్తోంది. అటు నుంచి రింగు రోడ్డుపై కొందరు యవకులు కారులో వస్తున్నారు. దీంతో బాలిక వెళ్దుండడం అందరూ గమనించారు. దీంతో ఓ అడ్రస్ చెప్పాలని ఆ బాలికతో మాటలు కలిపారు. దీంతో నిజమేనని భావించిన ఆ బాలిక అడ్రస్ చెబుతూ ఉంది. దీంతో వెంటనే కారులోంచి దిగిన ఓ యువకుడు ఆ బాలిక కారులోకి ఎక్కించుకుని కిడ్నాప్ చేశారు. దీంతో ఆ రాత్రంతో కారులోనే ఆ బాలికపై దారుణంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఇది కూడా చదవండి: Cyber Cheater: వీడు మామూలోడు కాదు.. ఏకంగా 250 మంది అమ్మాలను మోసం చేసి 8 కోట్లు దోచాడు!
అర్థరాత్రి రతు ప్రాంతంలోని ఓ రెస్టారెంట్ వద్ద ఓ కారు అనుమానాస్పదంగా ఆగి ఉండడం పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. ఎవరున్నారని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే వారున్న కారును తనిఖీ చేయగా అందులో బాలిక ఏడుపు శబ్దం వినిపించింది. ఏం జరిగిందని అడగగా ఆ బాలిక జరిగిన దారుణాన్ని మొత్తం వివరించింది. వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగిందని రుజువైంది.
దీంతో సదరు బాలికను మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించి కారులో ఉన్న నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.