ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. వయసుతో సంబంధం లేకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు.. కామాంధులు. ఒంటరిగా కనిపిస్తే చాలు వారిని చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి మరొకటి వెలుగులోకి వచ్చింది. బాలికను బైక్‌పై డ్రాప్ చేస్తామన్న యువకులు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన స్ధానికులు నిందితులను సజీవ దహనం చేశారు. జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది.
పొరుగు గ్రామంలో పెండ్లి వేడుకకు హాజరై బాధితురాలి కుటుంబం గ్రామానికి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్‌లు లేకపోవడంతో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా.. వారిని బాలికను డ్రాప్ చేయాలని బాధితురాలి తండ్రి కోరాడు. సరేనన్న యువకులు మార్గమధ్యలోకి వెళ్ళాక.. బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లిన నిందితులు ఆమెపై లైంగిక దాడి చేశారు. తల్లిదండ్రులు ఇంటికి తిరిగివచ్చాక బాలిక జరిగిన విషయం చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహంతో నిందితులకు దేహశుద్ధి చేశారు. వారిపై కిరోసిన్ చల్లి నిప్పంటించారు. దీంతో ఓ నిందితుడు మరణించగా కాలిన గాయాలైన మరో వ్యక్తిని రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
— Govardhan Reddy (@gova3555) June 9, 2022
ఇది కూడా చదవండి: Peddapalli: అన్నం పెడతానని తీసుకెళ్లి.. తొమ్మిదేళ్ల బాలికపై 44ఏళ్ల వ్యక్తి అత్యాచారం!