చేతబడి, తాంత్రిక చర్యల పేరుతో కొందరు దారుణాలకు పాల్పడుతున్నారు. ఆధునిక యుగంలో కూడా వీటిపై అనేక మంది అమాయక జనాలు ఆసక్తి చూపిస్తూ సొంత వారిని కూడా బలి చేస్తూ ఊహించని కిరాతకానికి పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే సొంత సోదరిని నాలుక కోసి, గర్భాశయం బయటకు తీసి దారుణంగా హత్య చేశారు. తాజాగా జార్ఖండ్ లో వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్థానిక మీడియా తెలిపిన కథనం ప్రకారం.. లలితా దేవి, దినేష్ ఓరాన్ ఇద్దరు భార్యాభర్తలు. వీరు గఢ్ వా నగరంలోని వార్డ్ నెంబర్ – 6లోని తోలాలో నివాసం ఉంటున్నారు. అయితే లలితా దేవికి సొంత సోదరి అయిన గుడియా దేవి అనే చెల్లెలు ఉండేది. ఇటీవల గుడియా దేవి అక్కవాళ్ల ఇంటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే లలితా దేవి, దినేష్ ఓరాన్ దంపతులిద్దరూ ఓ మాంత్రికుడు తమ ఇంటికి పిలుపించుకున్నారు. అలా ఏకంగా రెండు, మూడు రోజుల పాటు ఈ భార్యభర్తలిద్దరూ మంత్రప్రయోగాలు చేశారు.
ఇది కూడా చదవండి: Mother: భర్తను భయపెట్టడానికి 2 నెలల బిడ్డపై ప్రతాపం.. హింసిస్తూ వీడియో..
ఇక మంత్రప్రయోగాల అనంతరం ఈ దంపతులిద్దరూ గుడియా దేవిని బలివ్వాలనే ఆలోచనకు వచ్చారు. ఇక ఇందులో భాగంగానే గుడియా దేవి నాలుకను కోసి, గర్భాశయాన్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి బయటకు తీసినట్లుగా తెలుస్తోంది. అక్కా, బావ దాడిలో తీవ్రంగా గాయపడిన గుడియా దేవి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ దంపతులతో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. పాతకక్షల కారణంగానే గుడియా దేవిని దంపతులిద్దరూ మంత్రతంత్రాలతో బలి చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.