ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత భర్తను కాదని పరాయి మగాడితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. అయితే ఆ ఇల్లాలు భర్త పేరు మీదున్న బీమా సొమ్ముపై ఆశపడింది. ఆ డబ్బులకు కక్కుర్తిపడ్డ ఆ మహిళ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
సమాజంలో రోజు రోజుకు ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవిల్లోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ మహిళ బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. జార్ఖండ్ ఖుంటి జిల్లాలోని ఓప్రాంతం. ఇక్కడే మరియం-వాసిల్ సూరిన్ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది.
ఇక పెళ్లైన నాటి నుంచి ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. అయితే రాను రాను మరియం తన భర్తను కాదని స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ వచ్చింది. అలా చాలా కాలం పాటు ఆ మహిళ భర్త కళ్లు గప్పి ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే మరియం భర్త వాసిల్ సూరిన్ గతంలో అతని పేరు పేరు మీద బీమా ఇన్సురెన్స్ పాలసీ తీసుకున్నాడు. అదే డబ్బులకు కక్కర్తిపడ్డ మరియం.. ఎలాగైన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి బీమా డబ్బులు తనకు దక్కేలా చేసుకోవాలని ప్లాన్ గీసింది. ఇందుకోసం మరియం పక్కా ప్లాన్ తో భర్త హత్యకు పథకం రచించింది. అయితే ఇటీవల మరియం ఆమె భర్త వాసిల్ సూరిన్ ఇంట్లో ఉన్నారు. ఇదే సమయంలో మరియం మెల్లగా ఇంటికి తలుపులు పెట్టింది.
ఏమాత్రం భర్తకు అనుమానం రాకుండా మరియం వెనకాల నుంచి ఓ ఇనుప రాడ్ తో భర్త తలపై బలంగా బాదింది. ఈ దాడిలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అనంతరం భర్త హత్యను ప్రమాదవశాత్తు చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు ముందుగా మృతుడి భార్య మరియంను విచారించారు. మొదట్లో పొంతనలేని సమాధానాలు చెప్పిన మరియం.. చివరికి అసలు నిజాన్ని బయటపెట్టి తన నేరాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు మరియంను అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకంగా మరింది. బీమా డబ్బుల కోసం కక్కుర్తిపడి చివరికి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన ఈ కిలాడీ లేడీ కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.