అప్పట్లో నటిగా, దర్శకురాలిగా ఉన్న జీవిత రాజశేఖర్ ఇప్పుడు మాత్రం అప్పుడప్పుడు మీడియాలో మాత్రమే కనిపిస్తుంటారు. అయితే ఆమె భర్త హీరో రాజశేఖర్ మాత్రం అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే మారిన టెక్నాలజీ కారణంగా ఎంతో మంది సెలబ్రెటీలు కొందరి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన విషయం తెలిసిందే. ఇలా ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రెటీలు సైబర్ నేరగాళ్ల చేతిలో నిండామోసపోయి చివరికి పోలీసులను ఆశ్రయించారు.
అయితే తాజాగా జీవిత రాజశేఖర్ కూడా మోసపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే? ఇటీవల జీవిత తన ఇంట్లో జియో వైఫే కనెక్షన్ ను తీసుకున్నారు. కనెక్షన్ తీసుకున్న కొన్ని రోజుల తర్వాత అనౌన్ నెంబర్ నుంచి జీవితకు ఓ కాల్ వచ్చింది. ఇటీవల మీ ఇంట్లో జియో వైఫై కనెక్షన్ ఇచ్చింది నేనేనని, అయితే ఇప్పడు నాకు జియో నుంచి ప్రమోషన్ వచ్చింది. దీంతో ఇప్పుడు కొన్ని వస్తువులు సగం ధరకే మీరు కొంటే, నాకు మరో ప్రమోషన్ వస్తుందని తెలిసిన వ్యక్తుల పేర్లు చెప్పు జీవితను బురిడి కొట్టించాడు. దీంతో ఇదంతా నిజమేనేమోనని నమ్మిన జీవిత.. సరే, ఈ వ్యవహారం ఏంటో మా మేనేజర్ చూసుకుంటాడని అతనికి తెలిపింది.
జీవిత అలా చెప్పడంతో ఆమె మేనేజర్ ఫోన్ చేసిన అతడికి ముందుగా రూ. లక్షన్నర రూపాయలు పంపించాడు. ఆ తర్వాత జీవిత మేనేజర్ అతడికి కాల్ చేయగా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇది పక్కా మోసమే అనుకున్న జీవిత మేనేజర్ వెంటనే జీవితకు ఈ విషయాన్ని చేరవేశాడు. ఇది విన్న జీవిత రాజశేఖర్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక మోసపోయామని తెలుసుకున్న జీవిత చేసేదేం లేక వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా నిందితుడు తమిళనాడుకు చెందిన నరేష్ గా గుర్తించి అరెస్ట్ చేశారు.