కుల పెద్దల తీర్పుకు మరో ప్రాణం పోయింది. గ్రామంలోని నలుగురు కుల పెద్దలు ఇష్టానుసారంగా తీర్పులు ఇస్తూ చివరికి బాధితుల జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నారు. సరిగ్గా ఇలాగే ఓ కుల పెద్దలు ఇచ్చిన తీర్పు కారణంగా ఓ యువకుడి ప్రాణం గాలిలో కలిసిపోగ, అతని తల్లి పరిస్థితి విషమంగా మారింది. జనగామ జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జనగామ జిల్లా కేంద్రంలోని పెద్దపహడ్ గ్రామానికి చెందిన సాయి కుమార్(24), గోపిరాజుపల్లికి చెందిన భాగ్య అనే ఇద్దరూ ప్రేమించుకున్నారు.
ఎలాగైన సరే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి నిరాకరించడంతో మే13న స్థానికంగా ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి భువనగిరి పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగి నివాసం ఉంటున్నారు. అయితే సాయి కుమార్ కు వారి కుల పెద్దలు ఫోన్ చేసి ఊరికి తిరిగి ఊరికి రావాలని, వస్తే మీ ఇద్దరి కుటుంబ సభ్యుల ఇష్టం మేరకు ఘనంగా పెళ్లి చేస్తామని మాటిచ్చారు. పెద్దల మాట నిజమేనని నమ్మిన ఆ జంట తిరిగి తమ స్వగ్రామంలో అడుగు పెట్టారు. నిజంగానే పెళ్లి చేస్తారని భావించిన ఆ జంటకు నిరాశే ఎదురైంది. ఇక నాలుగు నెలల పాటు భాగ్యను సాయి కుమార్ వద్దకు పంపకుండా చేశారు.
కొంత కాలానికి కుల పెద్దల లోలోల ఒప్పందం కారణంగా కారణంగా భాగ్య తల్లిదండ్రులు ఆమెను మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. దీంతో భాగ్య ఇదే విషయాన్ని సాయి కుమార్ కు ఫోన్ చేసి చెప్పింది. కోపంతో ఊగిపోయిన సాయి కుమార్ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 7న వారిందరినీ పిలిపించి విచారించే క్రమంలోనే వారి కుల పెద్దలు పంచాయితీ పెట్టారు. ఇదే పంచాయితిలో కుల పెద్దల తీర్పులో సాయి కుమార్, అతని తల్లిదండ్రులు తీవ్ర అవమానానికి గురయ్యారు. దీనిని భరించలేని సాయి కుమార్, అతని తల్లి అక్కమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. వెంటనే గమనించిన అతని కుటుంభికులు ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ సాయి కమార్ మరణించగా, అతని తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వీరి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుల పెద్దల తీర్పులో ప్రాణాలు కోల్పోయిన సాయి కుమార్ ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.