అతనికి ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు. ఇక ఎలాగైన తన ప్రేమను చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇదే విషయాన్ని ఇటీవల ప్రేమించిన అమ్మాయికి వివరించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
నేటి కాలం యువతి యువకులు ప్రేమ పేరుతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులోనే ప్రేమలో పడుతూ చదువును పక్కన బెడుతున్నారు. ఇక చదువు పేరుతో బయటకు వెళ్తూ సినిమాలు, షికారులు అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తీరా ప్రేమించిన వ్యక్తి మొహం చాటేయండతో హత్య చేయడమో లేదంటే ఆత్మహత్య చేసుకోవడమో చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ యువకుడు ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పోలీసుల కథనం ప్రకారం.. జనగాం జిల్లా తొర్రురులోని చర్చి బజారులో అల్లం శ్యామ్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నారు. ఇతడు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. శ్యామ్ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. రోజు రోజుకి ఆమెపై విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు. కానీ, ఆ యువతి మాత్రం శ్యామ్ ప్రేమని తిరస్కరించింది. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఆ తర్వాత అతనికి ఏం చేయలో తెలియక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని టైమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుమారుడి మరణ వార్త తెలుసుకుని అతని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకున్న యువకుడి నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.